Advertisement

ధాన్యం కొనుగోళ్లు షురూ

Oct 17 2020 @ 01:57AM

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం

ఇప్పటికే డివిజన్ల వారిగా సన్నాహక సమావేశాల ఏర్పాటు

జిల్లాలో మొత్తం 337 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

1.23 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం

ప్రస్తుతం అందుబాటులో 62 లక్షల గన్నీ బ్యాగులు

ధాన్యం తరలించేందుకు 7 క్లస్టర్‌లుగా విభజన

కొనుగోలు చేసిన ధాన్యాన్ని 151 రైస్‌మిల్లులకు కేటాయింపు


కామారెడ్డి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సీజన్‌లో 4.95లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే డివిజన్‌ల వారిగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులకు, రైస్‌మిల్లర్లకు అవగాహన కల్పించారు. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యే క దృష్టి సారించారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బ ందులు కల్గకుండా ధాన్యం తడవకుండా అధికారులు కేంద్రాల వద్ద ఏర్పా టు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 337 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. ఈ కేంద్రాలను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్‌ రకానికి క్వింటాళ్లకురూ.1888, ‘బీ’ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1868 చెల్లించి  ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. 17 తేమ శాతం ఉన్న వడ్లనే కొనుగోలు చేయనున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇతర సౌకర్యాలను కేంద్రాల వద్ద కలిపించనున్నారు.


5.95 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2 లక్షలకు ఎకరాలకు పైగానే రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌, కాలువ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రుల్లాబాద్‌, పోచారం ప్రాజెక్ట్‌ కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు కామా రెడ్డి, దోమకొండ, లింగంపేట తదితర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు కావడం ఇదే మొదటిసారి. ఈ లెక్కన 5.95లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవ సాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.95 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పౌరసరఫ రాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సన్నరకం ధాన్యం మూ డు లక్షల మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 2 లక్షల మెట్రిక్‌ టన్నులు రానుందని అంచనా వేశారు.


337 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో ఈ వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 337 కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఏర్పడ్డ ఇబ్బందుల సమస్యలు అనుభావాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ప్రణాళికలను రూపొందించారు. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో అదనంగా వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన గా మొత్తం 337కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకై కలెక్టర్‌ శరత్‌ నిర్ణయించారు. 309పీఏసీఎస్‌లు, 20ఐకేపీ, 8మార్కెటింగ్‌ కమిటీల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి ధాన్యం సేకరణకు 1కోటి 23లక్షల గన్నీ బ్యాగు లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే 62లక్షల 52వేల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్‌, తేమశాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ కాంటాలు, గన్నీ సంచులు సిద్ధం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.


ట్రాన్స్‌పోర్ట్‌ కోసం 7 క్లస్టర్‌ల ఏర్పాటు

జిల్లాలో గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేం దుకు ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఈ అనుభావాలను దృష్టి లో పెట్టుకుని ఏడాది నుంచి ధాన్యాన్ని తరలించేందుకు క్లస్టర్‌లుగా విభజిం చారు. గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో 5 క్లస్టర్‌లను ఏర్పాటు చేయగా ఈ వానాకా లం సీజన్‌లో మాత్రం 7 క్లస్టర్‌లుగా విభజించి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా మిల్లులకు ధాన్యాన్ని తరలించనున్నారు. మొదటి క్లస్టర్‌లో బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాలు ఉండగా రెండో క్లస్టర్‌లో జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుం ద, పెద్దకొడప్‌గల్‌, మూడో క్లస్టర్‌లో పిట్లం, నిజాంసాగర్‌, నాల్గో క్లస్టర్‌లో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, ఐదవ క్లస్టర్‌లో గాంధారి, సదాశివనగర్‌, రామారెడ్డి, ఆరవ క్లస్టర్‌లో కామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, రాజంపేట, ఏడవ క్లస్టర్‌ లో దోమకొండ, బీబీపేట, భిక్కనూర్‌ మండలాలను ఉంచారు. ఇక్కడి నుంచి ప్రతీరోజు 250-350 లారీల ద్వారా వరి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించ నున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో 151 రైస్‌మిల్లులకు కేటాయిం చారు. ఇందులో 116 రా మిల్లులు ఉండగా 35 బాయిల్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి.


నేటి నుంచి ప్రారంభిస్తాం..యాదిరెడ్డి, అదనపు కలెక్టర్‌, కామారెడ్డి

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం నుంచి ప్రారంభించనున్నాం. ఈ వానాకాలం సీజన్‌లో 4.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు గాను 337 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. రైతులు పదిహేడు తేమ శాతం ఉండే విధంగా చూసుకోవాలని, తాళ్లు లేకుండా ఆరబెట్టిన ధాన్యా న్ని కేంద్రాలకు తీసుకురావాలి. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తు న్నాం.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.