ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-18T05:11:32+05:30 IST

గ్రామాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమ య్యాయి. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 4.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగు బడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శని వారం బోయినపల్లి మండలం కొదురుపాకలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
కొనుగోళ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

- జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

-  1.65 లక్షల ఎకరాల్లో వరిసాగు 

- 4.17 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా  

-  కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమ య్యాయి. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 4.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగు బడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శని వారం బోయినపల్లి మండలం కొదురుపాకలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు జరిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుత రబీలో 1.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా 84,109 మంది రైతులు 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు కూడా మొదలుపెట్టారు. దీనికి అనుగు ణంగా గ్రామాల్లోనే కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేపడుతున్నారు. జిల్లాలో 4.17 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు.  ధాన్యం రవాణాలో ఇబ్బందులు కలగకుండా 300 లారీలను అందుబాటులో ఉంచారు. రైతులకు కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868 నిర్ణయించారు. 


కొనుగోళ్లలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి 

యాసంగి కాలానికి సంబంధించి వరి ధాన్యం కొను గోలు చేసే కేంద్రాల్లో ప్రతీ ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి సహ కరించాలని  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కోరారు. శనివారం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ అంజయ్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, ప్రజాప్రతినిధులతో ధా న్యం కొనుగోళ్ల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, రైతులు, కొను గోలు కేంద్రాల సిబ్బందికి సహకరించాలని, కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాల న్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. యాసంగికి సంబంధించి 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉందన్నారు. ఇందుకోసం 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు  చెప్పారు.  కొనుగోళ్లలో వ్యవసాయ విస్తరణ అధికారులదే ముఖ్య పాత్రని స్పష్టం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్‌తో శుభ్రపచరాలన్నారు. నిబంధనల ప్రకారం విస్తరణ అధికారులలు  ధ్రువీకరిం చిన తర్వాతే తూకం వేసి మిల్లులకు పంపించాలన్నారు. ధాన్యం రవాణాకు 300 లారీలు అందుబాటులో ఉంటా యన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా సంబంధిత మండల ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాల న్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అందుబా టులో ఉండాలని, ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ఇబ్బందులు తలెత్తితే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో రైతు బంధు సమి తి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్‌ హరికృష్ణ, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, వ్యవసాయ అఽధికారి రణధీర్‌రెడ్డి, పౌరసరఫరాల డీటీలు ఎలుసాని ప్రవీణ్‌, వహీదుద్దీన్‌ పాల్గొన్నారు. 


రైతు సంక్షేమానికి పెద్దపీట

బోయినపల్లి: రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ అన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొను గోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం కరోనా కాలంలో కూడా  ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. రైతుల ఇంట వెలు గులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, వైస్‌ ఎంపీపీ నాగయ్య, నాయకులు కత్తెరపాక కొండయ్య, కొనకటి లచ్చిరెడ్డి, బొల్లవేని తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T05:11:32+05:30 IST