
తొమ్మిది పరీక్ష కేంద్రాల ఏర్పాటు
అనంతపురం సెంట్రల్, జూలై 4: ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్-2022 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. అనంతపురం జేఎనటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ వరకు ఈ పరీక్షలు ఆనలైన ద్వారా నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనంతపురంలో ఐదు, తాడిపత్రిలో రెండు, గుత్తి, పుట్టపర్తి పట్టణాల్లో ఒకటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో 2467మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 183మంది గైర్హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషనలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెట్ నిర్వాహక చైర్మన ప్రొఫెసర్ రంగజనార్దన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
పరుగులు పెట్టిన విద్యార్థులు..
ఈఏపీసెట్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 6 గంటలవరకు రెండు సెషనలలో నిర్వహిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ముందుగానే ప్రకటించడంతో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఉరుకులు పరు గులు పెట్టారు.
