తుపాకులతో ర్యాలీలు ప్రారంభించడమా !

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

ఉత్సవ ర్యాలీలను తుపాకులు పేల్చి ప్రారంభించరని, తెలంగాణలో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సంస్కృతిని తీసుకువచ్చేవిధంగా జిల్లాకు చెందిన మంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ ఆరోపించారు.

తుపాకులతో ర్యాలీలు ప్రారంభించడమా !
జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ర్యాలీ

- ప్రజలను భయపెట్టే సంస్కృతి తెస్తున్నారా ?

- కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ 

జడ్చర్ల, ఆగస్టు 14 : ఉత్సవ ర్యాలీలను తుపాకులు పేల్చి ప్రారంభించరని, తెలంగాణలో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సంస్కృతిని తీసుకువచ్చేవిధంగా జిల్లాకు చెందిన మంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ ఆరోపించారు. జడ్చర్లలో ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎర్రశేఖర్‌ మాట్లాడుతూ బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ర్యాలీని తుపాకులతో ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను భయ పెట్టి, లొంగదీసుకుని కేసులు పెట్టే సంస్కృతి మహబూబ్‌నగర్‌లో దాపురించిం దని ధ్వజమెత్తారు. పబ్లిక్‌లో ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌తో ఫైర్‌ చేసారని, పొరపాటు జరిగితే చిన్నారులు మృతిచెందే పరిస్థితి తలెత్తేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ లాంటి వ్యక్తులను రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించేవిధంగా ప్రజలు ఆలో చిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిత్యానందం, రబ్బా ని, బుర్ల వెంకటయ్య, బుక్క వెంకటేశ్‌, గోప్లాపూర్‌ యాదయ్య, రహీ మొద్దీన్‌, కరాటే శ్రీను, పర్శవేది, సంధ్య, నాయకులు పాల్గొన్నారు. 

‘గ న్‌ ఫైర్‌’పై చర్యలు తీసుకోవాలి

- టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 14 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మంత్రి జరిపిన గన్‌ఫైర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని న్యాయవాది, టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రొహిబిటెడ్‌ గన్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లో ఎలా కాల్పులు జరుపుతారని, థర్డ్‌ పర్సన్‌ చేతికి గన్‌ ఇచ్చే అధికారం ఎస్పీకి ఉన్నట్లు ఏ చట్టంలో ఉందో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబ్బర్‌బులెట్‌ అని చెబుతున్నారని, అది ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకి అని నిపుణులు చెబుతున్నా పోలీసులు ఇన్సాస్‌ అని చెబుతున్నా అది కూడా  ప్రొహిబిటెడ్‌ గన్‌ అని, దీన్ని వినియోగించడానికి వీల్లేదని చట్టం చెబుతోందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని, ఐపీసీ 336, ఆయుధాల చట్టం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్ష ంలో కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. మంత్రి ఫైర్‌ చేసిన గన్‌ను ఇప్పటివరకు సీజ్‌ చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో అడ్వకేట్‌ గోపాల్‌, మైత్రి యాదయ్య, విశ్వనాథ్‌ పాల్గొన్నారు. 

కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు

ఫ్రీడం రన్‌లో తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు ఆదివారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు పడాకుల సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, పోతుల రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST