హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’తో తెలంగాణలో థియేటర్లు పునఃప్రారంభం కానున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాశ్చాత్య దేశాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విడుదలైంది. మన దేశంలో ఈ నెల 4న విడుదల కానుంది. అదే రోజున చిత్రాన్ని ప్రదర్శించడానికి తెలంగాణలో మల్టీప్లెక్స్ యాజమన్యాలు సన్నాహాలు చేస్తున్నాయి. మహేశ్‌బాబుకు చెందిన ఎ.ఎమ్.బి. సినిమాస్‌ను కూడా 4న ఓపెన్ చేస్తున్నారు. ‘టెనెట్’తో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నట్లు ఎ.ఎమ్.బి సినిమాస్ యాజమాన్యం ప్రకటించింది. అలాగే మరి కొన్ని స్ర్కీన్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. సింగిల్ స్ర్కీన్లు ఈ నెల 4న తెరుస్తారా? లేదా? ఎన్ని థియేటర్లలో ‘టెనెట్’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లలో ‘టెనెట్’ ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఏపీలో థియేటర్లు తెరుచుకున్నాయి.