వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా

ABN , First Publish Date - 2022-06-26T06:33:03+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా
ప్యాలకుర్తిలో బాదుడే.. బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న సోమిశెట్టి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి

కోడుమూరు(రూరల్‌), జూన్‌ 25: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్యాలకుర్తి గ్రామంలో  శనివారం బాదుడే.. బాదుడు కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి సోమిశెట్టితో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పెరిగిన ధరలను ప్రజలకు వివరించారు. మెయిన్‌ బజార్‌లో సోమిశెట్టి మా ట్లాడుతూ ఏమాత్రం ముందుచూపులేని జగన్‌మోహన్‌రెడ్డి  ముఖ్యమం త్రి పదవిలో ఉండడం ప్రజల దురదృష్టం అని అన్నారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వివిధ రకాల చార్జీలు పెంచి, పన్నులు విధించి ప్రజలను కష్టాల్లోకి నెట్టారన్నారు. హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు.

 ‘దుల్హన్‌ పథకంతో ఆదుకున్న దేవుడు చంద్రబాబు’

టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద ముస్లింల ఆడపడుచుల వివాహానికి రూ.50 వేలు ఇచ్చి ఆదుకున్న దేవుడు చంద్రబాబు అని ప్యాలకుర్తిలో ముస్లింలు కొనియాడారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ నాయకులకు వారు ఘన స్వాగతం పలికారు. అలాగే మెయిన్‌ బజార్‌లో టీడీపీ నాయకుల సభలో విజయ్‌ అనే లారీ యజమాని తనగోడు వెల్లబోసుకున్నారు. మద్యం తెచ్చుకుంటూ డ్రైవర్‌ చేసిన తప్పిదానికి రూ.18లక్షలు ఫైన్‌ వేశారని టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. బీసీ సెల్‌ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్‌, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరాయచౌదరి, రవీంద్రగౌడ్‌, లక్ష్మయ్యశెట్టి, పాపారాయుడు, మదన్‌, రవికిషోర్‌, లాల్‌కుమార్‌, స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు, రం గన్న, వెంకటస్వామి, అలీం, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

ప్రజాదరణ కోల్పోయిన వైసీపీ: గౌరు చరిత

కల్లూరు: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆదరణ కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. శనివారం కల్లూరు అర్బన్‌ 31వ వార్డు రాఘవేంద్ర నగర్‌లో విద్యుత్‌, బస్సు  చార్జీల పెంపుపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ సంపద సృష్టించలేని సీఎం జగన్‌ పేద ప్రజల నుంచి పన్నులు, చార్జీల పెంపుతో డబ్బులు వసూలుచేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో అర్హులైన పేద ప్రజలకు అన్యాయం చేస్తూ పథకాలను కుదిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పంట నష్ట పరిహారాల్లో వైసీపీ అనుయాయులకు మాత్రమే లబ్ధి చేకూస్తున్నారని అన్నారు. అమ్మఒడి పథకంలోనూ భారీగా కోతలు విధించారని, ఏడాదికి రూ.15వేలు ఇస్తానని చెప్పి.. రూ.13వేలు మాత్రమే ఇస్తూ లబ్ధిదారులను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వై.నాగేశ్వరరావుయాదవ్‌, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహే్‌షగౌడు, పాణ్యం తెలుగు యువత, మైనార్టీ అధ్యక్షులు గంగాధర్‌గౌడు, ఫిరోజ్‌, 31వ వార్డు ఇన్‌చార్జి శైలజాయాదవ్‌, మాజీ ఎంపీపీ వాకిటి మాదవి, కుడా మాజీ డైరెక్టర్‌ చిన్న మారెన్న, ఎన్‌వీ రామకృష్ణ, బాబురాజు, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, జయన్న, బజారన్న, ప్రవీణ్‌, సులేమాన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T06:33:03+05:30 IST