కేంద్రంపై ధ్వజమెత్తిన..వడ్డే శోభనాద్రీశ్వరరావు

ABN , First Publish Date - 2021-06-21T18:16:49+05:30 IST

రైతు సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్రంపై ధ్వజమెత్తారు. నగరంలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన.. కరోనా సెకండ్‎వేవ్‎తో ప్రజలు అల్లాడుతుంటే..

కేంద్రంపై ధ్వజమెత్తిన..వడ్డే శోభనాద్రీశ్వరరావు

విజయవాడ: రైతు సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్రంపై ధ్వజమెత్తారు. నగరంలో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన.. కరోనా సెకండ్‎వేవ్‎తో ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకువచ్చి రైతుల ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తోందని ఆరోపించారు. తప్పుడు విధానాలతో 124 సెక్షన్లను పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 26న గవర్నర్‌ను కలిసి వ్యవసాయ చట్టాల రద్దు, రైతు ఉపశమన చట్టం చేయాలని వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. లేదంటే..కార్మిక, రైతు సంఘాలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేస్తామని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-21T18:16:49+05:30 IST