DGP: సంస్థల ప్రమేయం ఉంటే చార్జ్‌షీట్‌ వేస్తాం...

ABN , First Publish Date - 2022-08-02T18:18:27+05:30 IST

దక్షిణకన్నడ జిల్లాలో వరుసగా జరిగిన ముగ్గురి హత్యల్లో సంస్థల ప్రమేయం ఉంటే చార్జ్‌షీట్‌లో నమోదు చేస్తామని డీజీపీ ప్రవీణ్‌సూద్‌(DGP Praveen

DGP: సంస్థల ప్రమేయం ఉంటే చార్జ్‌షీట్‌ వేస్తాం...

బెంగళూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లాలో వరుసగా జరిగిన ముగ్గురి హత్యల్లో సంస్థల ప్రమేయం ఉంటే చార్జ్‌షీట్‌లో నమోదు చేస్తామని డీజీపీ ప్రవీణ్‌సూద్‌(DGP Praveen Sood) ప్రకటించారు. వరుస హత్యలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న దక్షిణకన్నడ జిల్లాను సోమవారం డీజీపీ సందర్శించారు. పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌నెట్టారు, మసూద్‌, ఫాజిల్‌(Pravinnettaru, Masood, Fazil) హత్య కేసుల్లో ఎంతటివారినైనా అరెస్టు చేస్తామన్నారు. హత్యల వెనుక సంస్థల ప్రమేయం ఉంటే చార్జ్‌షీట్‌(Charge sheet)లో పొందుపరుస్తామన్నారు. ప్రస్తుతం మూడు కేసుల్లోనూ విచారణలు సాగుతున్నాయన్నారు. ఈ దశలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమన్నారు. హత్యకు గురైనవారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ అనే వ్యత్యాసం పోలీసులు(The police) చూపరన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ముఖ్యమని అందుకోసం పోలీసులు ఎటువంటి చర్యలకైనా వెనుకాడరన్నారు. హత్యకేసులో సరైన మార్గంలోనే విచారణ జరుగుతోందని, చట్టపరంగా కఠినంగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ప్రవీణ్‌ నెట్టారు హత్య తర్వాత బెళ్లారె, సుబ్రమణ్య పోలీసులు బదిలీలతో దర్యాప్తునకు సంబంధం లేదన్నారు. ఇతర స్టేషన్ల అధికారులు, సిబ్బంది దర్యాప్తులో భాగస్వామ్యులవుతారన్నారు. 

Updated Date - 2022-08-02T18:18:27+05:30 IST