ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై నిమ్మగడ్డ సీరియస్‌‌

ABN , First Publish Date - 2021-02-28T22:57:58+05:30 IST

న్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌‌గా తీసుకున్నారు. రాజకీయ ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా..

ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై నిమ్మగడ్డ సీరియస్‌‌

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌‌గా తీసుకున్నారు. రాజకీయ ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరించకూడదని తెలిపారు. ఓటర్ స్లిప్పులను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దన్నారు. వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించారు. ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించడం కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్లు దైనందిన విధులు నిర్వహించడంలో అభ్యంతరం లేదన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ పంపారు.

Updated Date - 2021-02-28T22:57:58+05:30 IST