రాష్ట్ర ఎన్నికల అధికారికి పుష్పగుచ్చం అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఫారూఖీ
నిర్మల్ అర్బన్, జూన్ 28 : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థపారథి మం గళవారం జిల్లాలో పర్యటించారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ అతిథిగృహంలో బస చేశారు. ఆయనకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.