అసంబద్ధ విధానాలతో రాష్ట్రం దివాలా !

ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST

ప్రభుత్వ అసంబద్ధ విధా నాలతో రాష్ట్రం దివాలా తీసిందని బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.

అసంబద్ధ విధానాలతో రాష్ట్రం దివాలా !
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి

పీలేరు, మే 24: ప్రభుత్వ అసంబద్ధ విధా నాలతో రాష్ట్రం దివాలా తీసిందని బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. పీలేరులో మంగ ళవారం జరిగిన బీజేపీ శక్తికేంద్ర ప్రము ఖుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ  ప్రభుత్వ అనాలోచితమైన చర్యల కార ణంగా రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ మీద లక్షల రూపాయలు అప్పులు ప్రభుత్వం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు, రంగులు మార్చి ప్రచారం చేసుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజల్‌పై సుంకం తగ్గించిన నేపథ్యంలో  రాష్ట్రంలోనూ ప్రభుత్వం పెట్రోలు, డీజల్‌పై పన్నులను తగ్గించి ప్రజలపై భారాన్ని సడలించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో  బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బి. చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులి నరేంద్రకుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, వాల్మీకిపురం , పీలేరు మండల కమిటీల అధ్యక్షులు చంద్ర, మహదేవ నాయుడు, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుధారాణి, నారాయణస్వామి తదితదితరులు పాల్గొన్నారు. 

మదనపల్లె అర్బన్‌లో: రాజంపేట జిల్లాఅధ ్యక్షుడు ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేట పార్లమెంటరీ జిల్లాప్రధానకార్యదర్శుల కీలకమైన సమావేశం నార్వహించారు. ఈసందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 399 శక్తికేంద్రాలను ఏర్పాటు చేసి అందుకు ఒక ఇన్‌చార్జీని నియమించామన్నారు. కార్యక్రమంలో రాజంపేల పార్టమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పులి నరేంద్రకుమార్‌రెడ్డి, సురేష్‌రాజు, చీర్ల శ్రీనివాస్‌యాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T05:30:00+05:30 IST