కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-07-01T06:08:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైం దని కేంద్ర విమనాయన, రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రి వీకేసింగ్‌ ఆరోపించారు.

కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాత సూర్యాపేటలో జరిగి సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి వీకే సింగ్‌

ఆత్మకూర్‌(ఎస్‌) / సూర్యాపేట సిటీ/ మేళ్లచెర్వు/ హుజూర్‌నగర్‌/ మఠంపల్లి/ కోదాడటౌన్‌/ అనంతగిరి/ తుంగతుర్తి, జూన్‌ 30: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైం దని కేంద్ర విమనాయన, రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రి  వీకేసింగ్‌ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని పాత సూ ర్యాపేట, కందగట్ల గ్రామాల్లో గురువారం జరిగిన శక్తి కేంద్రాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు పరిష్కరించకుండా టీఆర్‌ఎస్‌ ఒట్ల రాజకీయం చేస్తుందని విమర్శించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో కేంద్ర మంత్రి వీకేసింగ్‌ విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కేసీఆర్‌ కుటుంబానికే పదవులు వచ్చాయన్నారు. అనంతరం శ్రీరామ్‌నగర్‌లో శక్తి కేంద్ర సమావేశం, 16వ వార్డులో పోలింగ్‌ బూత్‌ బీజేపీ కార్యకర్తల సమా వేశాల్లో మాట్లాడారు. మేళ్లచెర్వులోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారిని ఉత్తరప్రదేశ్‌ ఎంపీ రాజ్‌కుమార్‌చాహాల్‌ దర్శించుకుని ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన బీజేపీ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో ఎంపీ రాజ్‌కుమార్‌చాహాల్‌ మాట్లాడారు. గిరిజనుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం బ్రిటీష్‌ ప్రభుత్వం కన్నా అధ్వానంగా ప్రవర్తించిందన్నారు. గుర్రంబోడు భూముల విషయంలో రైతులను బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేసి నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టడం శోచనీయమన్నారు. అదే విధంగా మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూలోని 540 సర్వేనంబర్‌లో గల వివాదాస్పద అటవీ, ప్రభుత్వ, రీహబిటేషన్‌ భూములను ఎంపీ రాజ్‌కుమార్‌చాహాల్‌ పరిశీలించారు. పేద దళిత, గిరిజనులకు చెందిన కోట్ల విలువ చేసే భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తుంటే బాధిత రైతులు రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కోదాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఢిల్లీ విధానసభలో బీజేపీ పక్ష నాయకుడు శ్రీరామ్‌ వీర్‌సింగ్‌బిందూరి మా ట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలిపారు. అనంతగిరి మండలంలోని చనుపల్లిలో జరిగిన సమావేశంలో శ్రీరామ్‌ వీర్‌సింగ్‌ బిందూరి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందన్నారు. తుంగతుర్తిలో జరిగిన సమా వేశంలో హర్యాన రాష్ట్ర ఎంపీ సునీతదుగ్గల్‌  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కల్వకుంట్ల కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, కడియం రామచంద్రయ్య, సంకినేని వరుణ్‌రావు, ఎండీ. అబీద్‌, సలిగంటి వీరేందర్‌, కర్ణాకర్‌రెడ్డి, వరుణ్‌రావు, అబిద్‌, కనగాల నారాయణ, నూనె సులోచన, వంగవీటి శ్రీనివా స్‌రావు, వంగాల పిచ్చయ్య, చాడ శ్రీనివాస్‌రెడ్డి, అక్కిరాజు యశ్వంత్‌, తోట శేషు, వీరబాబు, చంద్రారెడ్డి, కోటిరెడ్డి, నరేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు. 


తెలంగాణలో వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే

యాదాద్రి,(ఆంధ్రజ్యోతి)/ చౌటుప్పల్‌: తెలంగాణలో వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కారేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రియాసేథి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రాయిగిరిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా అన్ని వర్గాలు, రైతుల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కష్టపడుతున్నారన్నారు. చౌటుప్పల్‌ లో జరిగిన మునుగోడు నియోజకవర్గ స్థాయి సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గగా సభ్యుడు పీకె కృష్ణదాస్‌ మాట్లాడారు. జూలై 3న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, నాయకులు నందకుమార్‌యాదవ్‌, గూడూరు నారాయణరెడ్డి, ఎరెడ్ల శ్రీనివాస్‌ రెడ్డి, దూడెల బిక్షం గౌడ్‌, దోనురి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

నకిరేకల్‌/ హాలియా/ దేవరకొండ/ నాగార్జునసాగర్‌/ మిర్యాలగూడ టౌన్‌: తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భూమిక్‌ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని 119అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ఇన్‌చార్జీలు మూడు రోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు. హాలియాలో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి అరున్‌చతుర్వేది మాట్లాడారు. 3వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. అనంతరం అనుముల మండలం పేరూరు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త అంజి ఇంట్లో అరుణ్‌ చతుర్వేది భోజనం చేశారు. అనంతరం కేంద్ర మాజీమంత్రి అరుణ్‌ చతుర్వేదిజీ నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. దేవరకొండలో జరిగి బీజేపీ కార్యకర్తల సమా వేశంలో కేంద్ర మాజీమంత్రి, ఎంపీ మీనా జాస్కర్‌ మాట్లాడారు. తెలంగా ణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కా ర్యకర్తలు కష్టపడాలని కోరారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసా గుతుందని ఆరోపించారు. మిర్యాలగూడలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భారతీఘోష్‌ మాట్లాడారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశాల్లో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పానుగోతు రవికుమార్‌, షేక్‌ బాబా, బి. యాదగిరిరెడ్డి, పోతెపాక సాం బయ్య, జర్పుల కళ్యాణ్‌నాయక్‌, కేతావత్‌ లాలునాయక్‌, చనమోని రాములు, సాథినేని శ్రీనివాసరావు, తల్లం అశోక్‌, ఎడ్ల రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:08:45+05:30 IST