అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పులపాలు

ABN , First Publish Date - 2022-06-27T06:30:44+05:30 IST

మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, జగన్‌ మోహన్‌రెడ్డి అసమర్థ పాలన వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఇది గుర్తించిన ప్రజలు ఎన్ని కలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నారన్నారు.

అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పులపాలు
సదస్సులో మాట్లాడుతున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

 ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు సీఎం కావడం తథ్యం 

 సభ్యత్వ నమోదు, ఐటీడీపీపై  అవగాహన సదస్సులో టీడీపీ నాయకురాలు అనిత

ఎస్‌.రాయవరం, జూన్‌ 26 : మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, జగన్‌ మోహన్‌రెడ్డి అసమర్థ పాలన వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఇది గుర్తించిన ప్రజలు ఎన్ని కలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నారన్నారు. మండ లంలోని అడ్డరోడ్డులో గల పార్టీ కార్యా లయంలో ఆదివారం టీడీపీ సభ్య త్వనమోదు, ఐటీడీపీపై ఏర్పాటైన అవ గాహన సదస్సులో ఆమె మాట్లాడారు.  రానున్న ఎన్నికల్లో ఐటీడీపీ పనితీరు ఎంతో కీలకం కానుందన్నారు. ప్రస్తుత రోజుల్లో సోషల్‌ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐటీడీపీ ద్వారా పార్టీ మరింత ఎంతో బలో పేతం అవుతున్నట్టు చెప్పారు.  

చంద్ర బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐటీడీపీలోని వారికి మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదులో పాయకరావుపేట నియో జకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేందుకు అంతా కృషి చేయా లన్నారు.  ఈ సదస్సులో ఎస్‌. రాయవరం, నక్కపల్లి, కోటవురట్ల మం డలాల టీడీపీ అధ్యక్షులు అమ లకంటి అబద్దం, కొప్పిశెట్టి వెంకటేష్‌, జానకి శ్రీనివాసరావు, టీడీపీ నాయ కులు ఎన్‌.వెంకటరాజు, గుర్రం రామ కృష్ణ, పల్లెల జగ్గారావు, ఆశ, జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు భీమరశెట్టి శ్రీనివాస్‌, నియోజకవర్గ అధ్యక్షుడు మెలిపెద్ది సతీష్‌, ప్రధాన కార్యదర్శి అల్లు మో హన్‌, నాలుగు మండలాల ఐటీ డీపీ ఇన్‌చార్జిలు ఎస్‌.లోవరాజు, పి.నాని బాబు, జి.రమేష్‌, డి.శ్రీనులతో పాటు పెద్ద సంఖలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

చురుగ్గా సభ్యత్వ నమోదు 

మునగపాక: మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదును చురుగ్గా చేపడు తున్నట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాపురంలో ఆదివారం  ఐటీడీపీ మండల ఇన్‌చార్జి శరగడం యోగి నాగేశ్వరరావు సభ్యత్వం పొందే విధానంపై గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులకు వివరించారు. తెలుగు మహిళ కార్యదర్శి కడియం అనూరాధ,తాతబాబు,  సం తోష్‌, రౌతు నాగఅప్పారావు,  జనార్థన్‌, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి రూరల్‌ : టీడీపీ క్రీయాశీలక సభ్యత్వంపై కార్యకర్తలంతా ప్రత్యేక దృష్టి సారించాలని కార్పొరేటర్‌ మాదంశెట్టి చినతల్లి అన్నారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ పరిధిలోని కొండకొప్పాక, పిళ్లావారివీధిల్లో ఆదివారం టీడీపీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతో ఇన్సూరెన్స్‌ పథకం కూడా లభిస్తుం దన్నారు.  టీడీపీ నాయకులు బోయిన మురళీ, గోపాలరావు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:30:44+05:30 IST