కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య లేఖ

ABN , First Publish Date - 2021-09-01T01:10:28+05:30 IST

కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య మంగళవారం లేఖ రాసింది.

కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య లేఖ

అమరావతి: కృష్ణాబోర్డుకు రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య మంగళవారం లేఖ రాసింది.శ్రీశైలం ఎగువన తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు ఆపాలని  ఈ లేఖలో విన్నవించింది.కేఆర్ఎంబీ చైర్మన్‌కు సమాఖ్య మెయిల్ ద్వారా లేఖ పంపించింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని ఈ లేఖలో ఫిర్యాదు చేసింది. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది.పాలమూరు, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మిషన్ భగీరథకు అనుమతి లేదని సమాఖ్య తెలిపింది. కృష్ణాబోర్డు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య లేఖలో పేర్కొంది.

Updated Date - 2021-09-01T01:10:28+05:30 IST