రాష్ట్రంలో రాజ్యమేలుతున్న రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-10-24T04:49:52+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతుందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రాజ్యమేలుతున్న రాక్షస పాలన
నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

చంద్రబాబును విమర్శించే అర్హత ఎమ్మెల్యేకు లేదు

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి


కొడవలూరు, అక్టోబరు 23 : రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతుందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని మిక్కిలింపేటలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ శనివారం నిరసన  చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలను పోలంరెడ్డి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనుభవరహిత పాలనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచేలా చేశారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కుంటుపరుస్తూ కేవలం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును ఎమ్మెల్యే ప్రసన్న విమర్శిస్తున్నారని ఇది తగదని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మాఫియా అభివృద్ధి తప్పా.. పేదల అభివృద్ధి కనపడడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకుల చైతన్య, కరకటి మల్లికార్జున, కోడూరు సుధాకర్‌రెడ్డి, చెక్కా మదన్‌, జొన్న శివకుమార్‌, కేతు వెంకటరమణారెడ్డి, నాసిన ప్రసాద్‌, కోడూరు బుజ్జిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


విద్యుత్‌ చార్జీల పెంపుపై ధ్వజమెత్తిన టీడీపీ 

ఇందుకూరుపేట: మండలంలోని కొరుటూరులో పెరిగిన విద్యుత్‌ చార్జీలపై టీడీపీ శ్రేణులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ మండల కన్వీనర్‌ వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ శాఖ మాయాజాలంగా మారిందన్నారు. పెంచిన ట్రూ అప్‌ చార్జీల వివరాలు పొంతన లేకపోవడం, దీనిపై అధికారులకు కూడా సరైన అవగాహన లేకపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్‌ భారం పెరిగిందన్నారు. అనంతరం  పార్లమెంటరీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చెంచుకిషోర్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేవలం విద్యుత్‌ చార్జీలు కాకుండా నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ ధరలు సగటు మనిషిని కుంగదీస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ వార్డు సభ్యులు గీత, కిష్టమ్మలను పోలంరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో  టీడీపీ నేతలు జాఫర్‌ సాహెబ్‌ కాలువ డిస్ర్టిబ్యూషన్‌ మాజీ చైర్మన్‌ కొండూరు సుధాకర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కృష్ణ చైతన్య, రంగారావు, ఇంతియాజ్‌, వెంకటేశ్వరరెడ్డి, చెన్నయ్య, రవీంద్రరెడ్డి, అన్నపూర్ణమ్మ, మధు, కృష్ణారెడ్డి, రవినాయుడు, బాలబొమ్మ వెంకటేశ్వర్లుతో పాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-24T04:49:52+05:30 IST