బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-26T05:24:57+05:30 IST

దేశంలో అత్యధిక సంఖ్యలో బహుజనులు రాజ్యాధికారంలోకి రావడమే లక్ష్యంగా ఐక్యంగా ఉద్యమించాలని బహుజ న సేన రాష్ట్ర అధ్యక్షుడు కదిరె కృష్ణ పిలుపునిచ్చారు.

బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
కార్యక్రమంలో మాట్లాడుతున్న కదిరె కృష్ణ

- బహుజన సేన వ్యవస్థాపకుడు కదిరె కృష్ణ

మంథని, సెప్టెంబర్‌ 25: దేశంలో అత్యధిక సంఖ్యలో బహుజనులు రాజ్యాధికారంలోకి రావడమే లక్ష్యంగా ఐక్యంగా ఉద్యమించాలని బహుజ న సేన రాష్ట్ర అధ్యక్షుడు కదిరె కృష్ణ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్థాపించిన సత్యశోధక్‌ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద ర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం ఏర్పా టుచేసిన బహుజన సదస్సులో కదిరె కృష్ణ మాట్లాడుతూ.. దేశ జనా భాలో 52 శాతం ఉన్న బహుజనులకు పాలించే అధికారాన్ని ఇవ్వకుండా ఇప్పటివరకు పాలించిన వారంతా కుట్రలు చేశారన్నారు. మనువాదుల కుట్రలను గ్రహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావి త్రిబాయి ఫూలేలు బహుజనులకు, ప్రధానంగా మహిళలకు విద్యను అం దించడానికి, వారిలో చైతన్యాన్ని నింపడానికి, సమాజంలో అసమానతల ను రూపుమాపడానికి తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ సైతం ఎస్సీ, ఎస్టీలకు మాదిగానే దేశంలో అధి కంగా ఉన్న వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ రిజర్వేషన్లు ఉండా లని పార్లమెంట్‌లో బిలు ప్రవేశపెడితే దాన్ని సైతం కుట్రపూరితంగా అడ్డుకున్నారన్నారు. అత్యధికంగా ఉన్న బహుజ నులను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంటూ అత్యల్పంగా ఉన్న అగ్ర వర్ణాల వారు దేశానికి ప్రధానులుగా, సీఎంలుగా పని చేస్తున్నారన్నారు. ఈ దేశంలో అధికంగా ఉన్న బహుజనులకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే రాజ్యాధికారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అధికారాన్ని సాధించుకే దిశగా గ్రామాగ్రామన బ డుగు, బలహీన వర్గాల ప్రజల్లో చర్చ జరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బహుజనుల వాటా ప్రకారం 52 శాతం ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు టీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అవస రమైతే బహుజనుల కోసం రాజకీయ పార్టీని స్థాపించాలని సూచించారు. ఇందు కోసం పుట్ట మధులాంటి నేతలు ఐక్యంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ.. మంథని ని యోజకవర్గంలో బహుజనులంతా చైతన్యవంతులు కావాలన్నారు. ఇంత కాలం ఒక కుటుంబమే ఎలా చెప్తే అలా తలుపుతూ పని చేస్తూ వచ్చా రన్నారు. అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు ఫూలేలా స్ఫూర్తితో మంథని నియోజకవర్గంలోని బడుగు, బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసు కురావటానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకు లు సునీతాగౌడ్‌, వాసు కేయాదవ్‌, తగరం శంకర్‌లాల్‌లు ప్రసంగించగా, భూపాలపల్లి జెడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిని, రాకేష్‌, మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, జెడ్పీటీసీ తగరం సుమలత, మంథని, మహ దేవపూర్‌, రామగిరి ఎంపీపీలు కొండా శంకర్‌, బన్సోడ రాణిబాయి, ఆరెల్లి దేవక్క-కొమురయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T05:24:57+05:30 IST