Advertisement

ప్రైవేటీకరణపై ఆగ్రహం

Mar 5 2021 @ 00:00AM
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

  1.  వివిధ పార్టీలు, సంఘాల ఆంధ్వర్యంలో బంద్‌


విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడం దారుణమని అన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరిస్తే చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


కర్నూలు(అర్బన్‌), మార్చి 5: విశాఖ ఉక్కు పరిశ్రమను  ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విద్యా సంస్థల బంద్‌లో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ బంద్‌ విజయవంతమైందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శి మోహన్‌, పీడీఎస్‌యూ కార్యదర్శి రవిలతో కలిసి అన్ని విభాగాలు, అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయాలను మూసివేయించి నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నాగార్జున, రామాంజీ, హరీష్‌,   రాము పాల్గొన్నారు.


కర్నూలు(ఎడ్యుకేషన్‌): కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే ఆలోచన విరమించుకోవాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌వో ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ పిలుపులో భాగంగా శుక్రవారం కర్నూలు నగరంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్‌ చేయించి బైక్‌ ర్యాలీతో కలెక్టరేట్‌ వరకు వచ్చి ధర్నా నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి.  డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఏ, ఏఐడీఎస్‌వో విద్యార్థి సంఘాల ప్రతినిధులు లెనిన్‌బాబు, శ్రీరాములుగౌడు, నాగరాజు, ధనుంజయ, రాజేష్‌, హరీష్‌కుమార్‌ రెడ్డి, తదితర విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 


కర్నూలు(రూరల్‌): కర్నూలు-2 డిపో కమిటీ ఆధ్వర్యంలో కొత్తబస్డాండ్‌ వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు, కార్మికులు కలిసి శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు మద్దతునిచ్చినట్లు డిపో కార్యదర్శి మహేశ్వరరావు తెలిపారు. పీఆర్‌ రెడ్డి, సుజయ్‌రాజు, మల్లేష్‌, శంకర్‌, శేఖర్‌ దాస్‌, సలాం, మద్దిలేటి  పాల్గొన్నారు.


ఆదోని: విశాఖ ఉక్కును కాపాడుకుందాం.. కడప ఉక్కును సాధించుకుందాం అని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్‌, రాయలసీమ విద్యార్థి సంఘం డివిజన్‌ అధ్యక్షుడు సతీష్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర బంద్‌లో భాగంగా పట్టణంలోని స్కూళ్లు, కాలేజీలు, షాపులు, బస్సులు ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. పీడీఎస్‌యూ నాయకులు అఖండ, మల్లికార్జున, ఓంకార్‌, మల్లికార్జున, జానీహరీష్‌, వంశీకృష్ణ, సీమ విద్యార్థి సంఘం నాయకుడు రామరాజు పాల్గొన్నారు. 


ఆదోని(అగ్రికల్చర్‌): విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి రాజు, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం రాష్ట్ర సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యా సంస్థలను బంద్‌ చేపట్టారు. నాయకులు బాలు, రాజు, రవి, ప్రవీణ్‌, రమేష్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో వేకువజామునుంచే వామపక్ష నాయ కులు బస్టాండ్‌కు చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాన రహదారుల్లోని వ్యాపార దుకాణాలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితమయ్యాయి. వామపక్ష, విద్యార్థిసంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బస్టాండ్‌ ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు రామాంజనేయులు, హను మంతు, పంపన్నగౌడ్‌, భాగ్యలక్ష్మి, రాజు, ప్రసాద్‌, రాముడు మాట్లాడుతూ ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దారుణమన్నారు. రైతులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములు త్యాగం చేశారన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని మరచి నేడు ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదన్నారు. ఉక్కుఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామ న్నారు. సత్యన్న, జబ్బార్‌, తిమ్మగురుడు, బాలరాజు, నరసింహులు, ఏసేపు, మల్లికార్జున గౌడ్‌, మాల నరసన్న, బాబు, సంజీవ్‌, మహేంద్ర, విజేంద్ర, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.


గోనెగండ్ల: గోనెగండ్లలో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుధాకర్‌ యాదవ్‌, వీరన్న, నందికుమార్‌ విద్యాలయాలను బంద్‌ చేయిం చారు. బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేసే ఆలోచన మానుకోవాలని డిమాండ్‌ చేశారు. వేణుగోపాల్‌, మజీద్‌, మురళి, వెంకీ, నబి, హర్ష, మనోజ్‌, ర


నందవరం: మండల కేంద్రమైన నందవరంతో పాటు, ముగతి మోడల్‌ స్కూల్‌, ప్రభుత్వ పాఠశాల దగ్గర బంద్‌ కార్యక్రమం శుక్రవారం నిర్వహిం చారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ముగతి సోమేశ్వరరెడ్డి, పీడీ యస్‌యూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు. గతంలో 32 మంది ప్రాణాలు త్యాగ చేసి సాధించు కున్నారని, ఆలాంటి దాన్ని నేడు బీజేపీ  కార్పొరేట్‌, బడా పెట్టుబడి దారులకు కట్టబెట్టాలని చూడడం దారుణం అన్నారు. కార్యక్రమంలో కోటకొండ రాము, నరసింహారెడ్డి, చరణ్‌, రవి, ఉపేంద్ర, వీరేష్‌ పాల్గొన్నారు.


పెద్దకడబూరు: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దేశానికి సంపదనిచ్చే సంస్ధలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని వామపక్ష నాయకులు రమాకాంత్‌ రెడ్డి, తిక్కన్న, భాస్కర్‌ యాదవ్‌, పరమేష్‌ అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులోని జడ్పీహెచ్‌ పాఠశాల నుంచి తహసీల్దార్‌ కార్యా లయం వరకు ర్యాలీ నిర్వహించారు. మీసేవా ఆంజినేయులు, మల్లికార్జున, యెసేబు, వీరేష్‌, హనుమంతు, శ్రీనివాసులు, సుంకన్న, సీఐటీయూ నాయకు డు చంద్ర పాల్గొన్నారు.


మంత్రాలయం: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, దానిని ప్రైవేటీకరిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సీపీఐ జిల్లా నాయకురాలు భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం మంత్రాలయంలో బంద్‌ నిర్వహించారు. బ్యాంకులు, దుకాణాలు, హోటళ్లను బంద్‌ చేయించి రాఘవేంద్ర సర్కిల్‌లో భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జయరాజు, ఎల్లప్ప, అనిల్‌, అంద్రెయ, ప్రసంగి పాల్గొన్నారు. 


డోన్‌(రూరల్‌): ఏఐవైఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పులిశేఖర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు శివన్న, ఎస్‌ఎఫ్‌ఐ మండల కన్వీనర్‌ హిమాద్రిగౌడు ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బంద్‌ చేయించారు. నాయకులు రాజేష్‌, హరినాథ్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇమిడి లక్ష్మణ సాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల మీదుగా ర్యాలీగా వెళ్లి పాఠశాలలను బంద్‌ చేయించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మండల కార్యదర్శి శివరామ్‌, రామాంజనేయులు, నాయకులు కొండయ్య, నాగమద్దయ్య, ఆదినారాయణ రెడ్డి, నాగన్న తదితరులు పాల్గొన్నారు.  ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం రంగనాయకులు ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాల నాయకులు వలిబాషా, దొరపల్లి రాజు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. 


తుగ్గలి: మండలంలోని తుగ్గలి, జొన్నగిరి తదితర గ్రామాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను బంద్‌ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


దేవనకొండ: దేవనకొండలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. విపక్షాల నాయకులు విజయభాస్కర్‌గౌడ్‌, ఉచ్చీరప్ప, మద్దిలేటిశెట్టి, వీరశేఖర్‌, బాబు, నర్సారావు, మల్లికార్జునగౌడ్‌, రాజాసాహెబ్‌, రామాంజనేయులు, బండ్లయ్య, శ్రీనివాసులు, మన్సూర్‌, మాబాషా, మనోజ్‌, నెట్టెకల్లు, నరేష్‌, శ్రీరాములు, మహేంద్ర, నాగేంద్ర, రాము, కోదండ తదితరులు పాల్గొన్నారు. 


గూడూరు: సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె.మోహన్‌, సీపీఐ నాయకులు శ్రీనివాసులు గూడురులో, నాగులాపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్‌ ఆధ్వర్యంలో  రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. సీపీఎం టౌన్‌ కార్యదర్శి రాజశేఖర్‌, నాయకులు మాధవరంగడు, రామాంజనేయులు, సీఐటీయూ మండల నాయకులు రవి, రమేష్‌, రాజు, శాంతన్న, ఆటో యూనియన్‌ నాయకులు రవి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


కోసిగి: విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోసిగి మండలంలో రాష్ట్ర బంద్‌ను సంపూర్ణమైనట్లు వామపక్ష పార్టీల నాయకులు రాముడు, గోపాల్‌, ఈరేష్‌, సిద్దప్ప, పూజారి శ్రీనివాసులు, మల్లికార్జున తెలిపారు. మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను బంద్‌ చేయించారు. 


కోడుమూరు: టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కోడుమూరులో వాహనాలను నిలిపివేశారు. దీంతో వాహనాలు దాదాపు 2కిలో మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంప్రదింపులు జరిపి మధ్యాహ్నం 1 గంటలకు బంద్‌ ఎత్తివేయించడం జరిగించడంతో వాహనాలు రాకపోకలు కొనసాగాయి. టీడీపీ నాయకులు కేఈ మల్లికార్జునగౌడ్‌, గోపాల్‌నాయుడు, ఆంధ్రయ్య, మాధవస్వామి, సీపీఎం నాయకులు గఫూర్‌మియ్య, వీరన్న, రాజు, సీపీఐ నాయకులు మాధవస్వామి, కృష్ణ, రాజు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.


పత్తికొండరూరల్‌: విశాఖ ఉక్కు ఆంఽద్రుల హక్కు అని, దాన్ని ప్రైవేటీకరించి ఉద్యోగులను రోడ్డున వేయవద్దని ఎన్‌జీవో సంఘం జిల్లా నాయకులు సాయిబాబా, బాలాజీ, అల్లీపీరా అన్నారు. శుక్రవారం పట్టణంలోని నాలుగు స్తంభాల  కూడలిలో ఉన్న మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఎదుట ఎన్‌జీవో, ఎస్టీయూ, యూటీఎఫ్‌, పెన్షన్‌దారుల సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, టిఎండి హుసేన్‌, గోవిందురాజులు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


హొళగుంద: హొళగుందలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. సీపీఎం, సీపీ ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, టీడీపీ నాయకులు కాలప్పచారి, వెంకటేశ్‌, పెద్ద హ్యాట మారెప్ప, శ్రీరంగా, మల్లికార్జున, తిప్పయ్య, పొంపాపతి పాల్గొన్నారు. 


ఆలూరు: ఆలూరులో బంద్‌ నిర్వహించారు. టీడీపీ నాయకులు రఘుప్రసాద్‌రెడ్డి, నరసప్ప, రామాంజి, సురేంద్ర, నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, మునిస్వామి, సీపీఐ నాయకులు నారాయణస్వామి, మైన, గోవర్ధన్‌, షాకీర్‌, టీడీపీ, వామపక్షాల నాయకులు నారాయణ, గుర్రం అనిల్‌, శేఖర్‌, సోమశేఖర్‌, మసాల జగన్‌, జిలాన్‌సాబ్‌, జహీర్‌, గూళ్యం రామాంజి, విష్ణుమూర్తి, గుండన్న, రమేష్‌, మల్లికార్జున, తిమ్మప్ప, బాషా, అంజి, రంగ, అంబన్న, శివ పాల్గొన్నారు.


ఆస్పరి: ఆస్పరిలో బంద్‌ చేపట్టారు. బస్టాండు నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను బంద్‌ చేయించారు. టీడీపీ మండల కన్వీనర్‌ వెంకటేశ్‌, మాజీ ఎంపీటీసీ కృష్ణాయాదవ్‌, సొసైటీ మాజీ చైర్మన్‌ నౌనేపాటిచౌదరి, శ్రీనివాస్‌గౌడ్‌, తెలుగుయువత నాయకులు నాగేంద్ర, రాజ్‌కుమార్‌, గోపాల్‌, సీపీఐ, సీపీఎం నాయకులు విరుపాక్షి, హనుమంతు, బ్రహ్మయ్య, చిన్నసుకంన్న, నాయకులు ముత్యాలరెడ్డి, పరమారెడ్డి, నరసప్ప, తిమ్మప్ప, రామాంజనేయులు, రవి, ఈశ్వర్‌, నరసింహులు పాల్గొన్నారు. 


బేతంచర్ల: పట్టణంలోని పాత బస్టాండులో సీఐటీయూ ఆధ్వర్యంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి అల్పాహారం తీసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎల్లయ్య, ఈశ్వరయ్య, బార్గవ్‌, ఉదయ్‌, వడ్డె సుబ్బరాయుడు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 


వెల్దుర్తి: వెల్దుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు మాధవస్వామి, ఏసయ్య, కోకిల నాగరాజు, మాబు, గిరి, అప్ప, బలరాం, పురుషోత్తం, రామాంజనేయులు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.


పత్తికొండటౌన్‌: ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయాలని చూస్తే సహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌ చేయవద్దని కేంద్రం తీసుకున్న దానిని ఉపసంహరించుకోవాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా పత్తికొండలో ఆ పార్టీ నాయకులు బంద్‌ పాటించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా, స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలను బంద్‌ చేయించారు. సీపీఎం ఆధ్వర్యంలో బ్యాంకులను మూసివేయించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలిలో జరిగిన బంద్‌ చేపట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు రాజాసాహెబ్‌, సురేంద్ర, కారన్న, కృష్ణ, సుల్తాన్‌, కారుమంచి, రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కోడుమూరు(రూరల్‌): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో గళం విప్పుతానని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాదు నుంచి ఆదోని వెళుతూ కోడుమూరులో నిర్వహించిన బంద్‌లో పాల్గొన్నారు.  ఏపీకి ఆర్థిక వనరు అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. 

 
పత్తికొండలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర నేత రామచంద్రయ్య


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.