చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-11-27T03:51:33+05:30 IST

జిల్లాలో 102 చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు భూగర్భ జలాల నోడల్‌ అధికారి, రాష్ట్ర పరిశీలకుడు కోదండరావు చెప్పారు. చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, గుర్లలో చెరువులను పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. అక్కడి రైతులతో మాట్లాడి ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యం
గుర్ల వద్ద చెరువును పరిశీలిస్తున్న అధికారుల బృందం




రాష్ట్ర పరిశీలకుడు కోదండరావు

 గుర్ల, నవంబరు 26: జిల్లాలో 102 చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు భూగర్భ జలాల నోడల్‌ అధికారి, రాష్ట్ర పరిశీలకుడు కోదండరావు చెప్పారు. చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, గుర్లలో చెరువులను పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. అక్కడి రైతులతో మాట్లాడి ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంఽధ్రప్రదేశ్‌ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పఽథకంలో భాగంగా చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు కొండలరావు తెలిపారు. ఇందుకుగాను రూ.1600 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా రూ.1200 కోట్లుకాగా..రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.400 కోట్లుగా తెలిపారు. ముఖ్యంగా గొలుసు చెరువులను అభివృద్ది చేసి నిల్వ సామర్థ్యం పెంచనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో భూగర్భ జలశాఖ డీడీ కేఎస్‌ శాస్ర్తి, జియాలజిస్ట్‌ చినబాబు, ఏపీడీ సత్యనారాయణ, ఇజ్జిరోతు ప్రసాద్‌, సీతారాములు పాల్గొన్నారు. 





Updated Date - 2020-11-27T03:51:33+05:30 IST