ముగిసిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-03-02T06:39:57+05:30 IST

కర్నూలు ఔట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి అండర్‌-22,-15 బాలబాలికల రెజ్లింగ్‌ పోటీలు సోమవారంతో ముగిసాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలు
విజేతగా నిలిచిన విశాఖపట్నం జట్టు

కర్నూలు(స్పోర్ట్స్‌), మార్చి 1: కర్నూలు ఔట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి అండర్‌-22,-15 బాలబాలికల రెజ్లింగ్‌ పోటీలు సోమవారంతో ముగిసాయి. అండర్‌-15 విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌గా నెల్లూరు జట్టు నిలువగా, రన్నర్‌పగా చిత్తూరు జిల్లా జట్టు, మూడో స్థానంలో వైజాగ్‌ జట్టు నిలిచింది. అండర్‌-23 విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప సాధించిన చిత్తూరు జిల్లా జట్టు, రన్నర్‌పగా అనంతపురం జిల్లా, మూడో స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. అనంతరం బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర రెజ్లింగ్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆర్కే పురుషోత్తం, సురేంద్రరెడ్డి, రాష్ట్ర సెపక్‌తక్రా సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు, పోటీల నిర్వాహక చైర్మన్‌ డా.రుద్రరెడ్డి, కార్యదర్శి రాబర్ట్‌, వ్యాపారవేత్త రాజేష్‌ కుమార్‌ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు ఎంఏ రవూఫ్‌, అవినాష్‌ శెట్టి, రసూల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పురుషోత్తం మాట్లాడుతూ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన బాలికలు బళ్లారిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, బాలుర విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన క్రీడాకారులు జలంధర్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. 

 చాంపియన్‌లుగా విశాఖపట్నం, నెల్లూరు జట్లు 

 మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 12 జిల్లాలకు చెందిన బాలబాలికలు జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో నెల్లూరు జట్టు, బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టు చాంపియన్‌గా నిలిచాయి. కర్నూలులోని ఆదర్శ విద్యామందిర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల డైరెక్టర్‌ డా.హరికిషన్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ చీఫ్‌ కోచ్‌ ఎన్‌ఎన్‌వీ రాజు, ఏపీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు విజేతలకు ట్రోఫీతో పాటు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేసి అభినందించారు. బాలుర విభాగంలో నెల్లూరు, గుంటూరు, కర్నూలు జట్లు వరుసగా మొదటి, రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం జట్లు నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. కార్యక్రమంలో పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, క్రీడా సంఘం ప్రతినిధులు ఎంఎండీ బాషా, నాగరత్నమయ్య, సుంకన్న, రాష్ట్ర ప్రతినిధులు రమేష్‌, చంద్రశేఖర్‌, దత్తరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:39:57+05:30 IST