8న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-07T23:50:23+05:30 IST

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వైఖరికి

8న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వైఖరికి నిరసనగా 8న అనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలాల్లోని అంబేద్కర్ విగ్రహాల దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్నారు. విద్యార్థులు, అమరులను బడ్జెట్ అవమానించిందని ఆయన ఆరోపించారు. అమరుల కుటుంబాలకు ఒక్క పైసా కేటాయించలేదని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతిని పట్టించుకోవడం లేదన్నారు. గతంలో స్వస్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు ఇస్తామన్నారని, కానీ ఇప్పుడేమో రూ.3 లక్షలకు కుదించారని ఆయన ఆరోపించారు. ఓ పార్టీ సభ్యులను సెషన్ మొత్తం బహిష్కరించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి చర్యలను కాంగ్రెస్‌ ఖండిస్తోందన్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కని ఆయన పేర్కొన్నారు. 


తన వ్యవహార శైలిని స్పీకర్  మార్చుకోవాలని ఆయన అన్నారు. సీఎం సైగలతో సభ నడపడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-07T23:50:23+05:30 IST