కెఎస్‌ గట్టులో విగ్రహ వివాదం

ABN , First Publish Date - 2020-11-30T04:52:57+05:30 IST

అత్తిలి మండలం కెఎస్‌గట్టు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది.

కెఎస్‌ గట్టులో విగ్రహ వివాదం

అత్తిలి, నవంబరు 29 : అత్తిలి మండలం కెఎస్‌గట్టు గ్రామంలో  అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. గ్రామంలోని 4 చెరువులు మధ్య గల ఎస్సీ కమ్యూనిటీ హాలు ఎదురుగా డిసెంబరు 6న అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఆ సామాజికవర్గం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే దీనిపై బీసీ సామాజిక వర్గంవారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. అధికారులు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటును నిలుపుల చేయాలంటూ ఎస్సీ సంఘం సభ్యులకు నోటీసులు ఇవ్వ డంతో గందరగోళం నెలకొంది. దీంతో ఎస్సీ  సామాజికవర్గం వారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారిపై పోలీసులకు, మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు, రెవెన్యూ వారు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఈ సంఘటన కలవరపెడుతోంది. రెండు వర్గాల వారు ఎవరికి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని ప్రశాంత  వాతావరణం నెలకొనేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-30T04:52:57+05:30 IST