ఈ విగ్రహాన్ని చూసి ముఖ్యమంత్రులే వణికిపోతారు

ABN , First Publish Date - 2020-07-08T03:07:16+05:30 IST

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్నట్టే మెరినా బీచ్ ఎంట్రన్స్ కూడా కొన్ని శిల్పాలు వరుసగా నిలబెట్టి ఉంటాయి. అందులో...

ఈ విగ్రహాన్ని చూసి ముఖ్యమంత్రులే వణికిపోతారు

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్నట్టే మెరినా బీచ్  ఎంట్రన్స్ కూడా కొన్ని శిల్పాలు వరుసగా నిలబెట్టి ఉంటాయి. అందులో ఒక విగ్రహం మాత్రం స్పెషల్‌గా కనిపిస్తుంది. ఒక చేతిలో కడియం పట్టుకుని రెండో చేత్తో ఎవరినో ప్రశ్నిస్తున్నట్టు నిలబడిన ఓ స్త్రీ విగ్రహం ఉంటుంది. మామూలుగా ఓ విగ్రహాన్ని చూస్తున్నట్టు ఉండదు. ఆమె మన ఎదురుగా నిలబడ్డట్టే అనిపిస్తుంది. కోపంతో రగిలిపోతూ విరబోతున్న జుట్టుతో ధిక్కారంగా నిలబడిన ఆ విగ్రహం నుంచి చూపు తిప్పుకోవడం కుదరదు. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది. ఆ విగ్రహం ఇంతకుముందు తమిళనాడు అసెంబ్లీ ఎదురుగా ఉండేది. తర్వాత ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉంది అంటూ ఆ శిల్పాన్ని అక్కడి నుంచి తీసేశారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ పెరీరా బీచ్ ఒడ్డున పెట్టారు. 2001 డిసెంబర్ లో ఆ విగ్రహాన్ని తొలగించినప్పుడు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారం చేజారిపోతుందేమో అన్న భయంతోనే ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ముందు నుంచే జయలలితే తీయించారనే రూమర్ ఇప్పటికీ వినిపిస్తోంది. 


అంతకుముందు కరునానిధి ఉన్నప్పుడు కూడా కొన్నాళ్లు ఆ విగ్రహానికి ఎదురుగా వెళ్లకుండా ఇంకో దారి నుంచి అసెంబ్లీలోకి వెళ్లేవారట. జీవితాంతం నాస్తికుడిగా ఎలాంటి సెంటిమెంట్లు లేకుండా బతికిన కరునానిధి కూడా ఆ విగ్రహానికి ఎదురుగా వెళ్లేందుకు బయపడేంత ఏముంది. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది. ఎందుకని ఆ శిల్పానికి ఎదురువెళ్లడానికి ముఖ్యమంత్రులు కూడా భయపడ్డారు.ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే ఒకసారి తమిళనాడు చరిత్రను, తమిళ సాహిత్యాన్ని చూడాలి. చోళులు పరిపాలనా కాలానికి వెళ్లాలి. ఒక తప్పుడు తీర్పు కారణంగా చేయని నేరానికి తన భర్తను కోల్పోయిన కన్నగి కోపానికి మధురై నగరం మంటల్లో చిక్కుకుంటుంది. ఆమె చూపుల్లో కనిపించిన కోపానికి ఆ మహారాజు గుండెబద్ధలై చనిపోతాడు. అందుకే కన్నగి అంటే ముఖ్యమంత్రులకు భయం. కన్నగి విగ్రహానికి ఎదురు వెళ్లాలన్నా భయం. 

Updated Date - 2020-07-08T03:07:16+05:30 IST