నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

Dec 6 2021 @ 00:48AM
నూతనంగా నిర్మించిన ఆలయం


ముండ్లమూరు, డిసెంబరు 5 : మండల కేంద్రమైన ముండ్లమూరులోని బస్టాండ్‌ కూడలి సమీపంలో రూ.49 లక్షల నిధులతో దేవాదాయ శాఖ నిర్మించిన శ్రీ పోలేరమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ ఈ నెల 10న శుక్రవారం జరగనుంది. సోమవారం నుంచి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. గతంలో ఉన్న దేవాలయం శిథిలావస్థకు చేరడంతో రెండు దశాబ్దాల నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు సైతం నిలిచి పోయాయి. ఎట్టకేలకు గ్రామస్థులు ఐక్యంగా ముందుకు రావడంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ప్రభుత్వానికి ప్రజల తరఫును చెల్లించే వాటాను ఆయనే స్వయంగా రూ.20 లక్షలకు పైగా వెచ్చించాడు. దీంతో దేవాదాయ శాఖ వారు వెంటనే పోలేరమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మొత్తం రూ.49 లక్షలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడప జిల్లా బద్వేలు వాసి ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామశర్మ ఆధ్వర్యంలో రుత్వికులు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రామంలో ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కావడంతో బంధువులు, కుటుంబ సభ్యులతో ముండ్లమూరుకు పండుగకల వచ్చింది. అద్దంకి - దర్శి ప్రధాన రహదారి వెంబడి సర్వాంగ సుందరంగా పోలేరమ్మ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గ్రామమంతా ఒకే తాటిపైకి వచ్చి ఆలయం నిర్మించడం విశేషం. 

సీఎ్‌సపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థాన ప్రధాన అర్చకులు ఎం.సత్యన్నారాయణశర్మ, ప్రసాద్‌శర్మలు స్వామివారి మూలవిరాట్‌ను వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గోపూజ చేశా రు. భక్తులు మహానైవేథ్యంతో గుడిచుట్టూ ప్రదక్షణలు చేసి స్వామివారికి సమర్పించారు. రాత్రికి నారాయణస్వామివారికి పల్లకిసేవ, రథోత్సవం నిర్వహించారు.అనంతరం దశహారతులు, కుంభహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎన్‌.నారాయణరెడ్డి తన సిబ్బందితో పర్యవేక్షించారు.

ఆంజనేయస్వామికి ఆకుపూజ

కందుకూరు : పట్టణంలోని జనార్ధనస్వామి దేవాలయంలోని సువర్చలాదేవి సమేత శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామికి 108 చాలీసా అహాషేకము, ఆకుపూజ ఆదివారము నిర్వహించారు.ఆంజనేయస్వామి భక్తులు, హనుమాన్‌ మాలధారులు అధిక సంఖ్యలో ఈ పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు మాదాల గోపి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా అన్న ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో జనార్ధనస్వామి ఆలయ చైర్మెన్‌ రావులకొల్లు బ్రహ్మానందం, ఈవో బైరాగి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.