నిగ్రహం– విగ్రహం

ABN , First Publish Date - 2021-01-08T06:38:29+05:30 IST

పరమత సహనంతో సాగిలపడి పరిధి లేని శాంతి వచనాలకు సాష్టాంగపడి జవసత్వాలు ఉడిగినట్టు....

నిగ్రహం– విగ్రహం

పరమత సహనంతో

సాగిలపడి

పరిధి లేని శాంతి వచనాలకు

సాష్టాంగపడి


జవసత్వాలు ఉడిగినట్టు

జడత్వంలా కూర్చుని

అన్యాయానికి ఎదిరెళ్లి

ఐక్య పోరాటం చేయని


నిర్వీర్యం అయి నిస్సత్తువు చేరిన

నిర్వేదం చెంది నిర్లిప్తంగా మారిన

నిరాశలో కూరి నిస్త్రాణంగా

నిలిచిపోయిన జాతిలో


రామసైన్యం ఆత్మలు

ఆవాహనం కావా?

సాధుజనుల రక్షణకు

రాముడే దిగి రాడా?


లంక రక్కసులను తురిమిన

చేతులు తస్కర దుష్కర్మల

తలలు తరిగేయవా?


స్తంభంలో

ఉగ్రనారసింహుడు ఉన్నట్లే

రాతివిగ్రహంలో

రాముడు ఉండడా?

ఆగ్రహం వచ్చి

నిగ్రహం కోల్పోయి

విగ్రహంలోంచి ఉరికి రాడా?


పెక్కుబాణాలు సంధించడా?

ముష్కరమూకల శిరస్సులు 

తుత్తునియలు చేయడా?



ఉషారం

Updated Date - 2021-01-08T06:38:29+05:30 IST