అండగా ఉండి... ఆదుకోండి

May 31 2021 @ 00:04AM

ఉపాధి కోల్పోయిన పనిమనుషులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు బాలీవుడ్‌ కథానాయిక కృతీసనన్‌. పనిమనుషులకు సాయపడేందుకు కొన్ని మార్గాలను సూచిస్తూ ఓ వీడియోను ఆమె ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గతంలోలానే పనిమనుషులకు పని చేసుకునే అవకాశం కల్పించటం ద్వారా వారి కుటుంబాన్ని ఆదుకోండి. వారి పేరును కూడా వ్యాక్సిన్‌ కోసం నమోదు చేయండి. అలాగే కరోనా, టీకాలకు సంబంధించి వారికి ఉన్న సందేహాలను తీర్చండి. ఆర్థిక అవసరాలు తీర్చేందుకు డబ్బు సాయం చేయండి. ముఖ్యంగా ఈ కష్టకాలంలో అండగా ఉన్నామనే భరోసాను పనిమనుషుల్లో కలిగించండి’’ అని కోరారు కృతీసనన్‌. ఆమె ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సహా పలు బాలీవుడ్‌ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.