బల్దియాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-03-04T06:51:37+05:30 IST

బల్దియాల్లో ఆక్ర మణలపై అధికారులు ఉక్కు పాద మోపుతున్నారు. కలెక్టర్‌ రవి ఇందుకోసం ప్రత్యేకచర్యలు తీసు కుం టున్నారు.

బల్దియాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం

  ప్రత్యేక అధికార బృందాల ఏర్పాటు

 వారంలో ఒక రోజు సర్వే.. చర్యలు

కూల్చివేతకు వెనుకాడేది లేదు..కలెక్టర్‌

 అక్రమార్కుల్లో నెలకొన్న గుబులు

 బల్దియాల్లో అక్రమ నిర్మాణాల నివారణకు  అడుగులు

 జగిత్యాల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : బల్దియాల్లో ఆక్ర మణలపై అధికారులు ఉక్కు పాద మోపుతున్నారు. కలెక్టర్‌ రవి ఇందుకోసం ప్రత్యేకచర్యలు తీసు కుం టున్నారు. అక్రమనిర్మాణాల నివారణకు ప్రత్యేక అధి కార బృందాలను ఏర్పరిచారు. వారంలో ఒకరోజు సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరగకముందే నిలిపివేయడానికి చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిర్మాణాలు చేస్తే ప్రభుత్వ ఆదేశాలమేరకు కూల్చివేతకు వెనుకాడేది లేదన్న సంకేతాలను పంపుతున్నారు. దీంతో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ ము న్సిపాల్టీల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వ్యక్తుల్లో గుబులు నెలకొంది. 

టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీల ఏర్పాటు..

 బల్దియాల్లో అక్రమ నిర్మాణాల నివారణకు జిల్లాస్థాయిలో వివిధ శాఖ ఉన్నతాధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్క్వాడ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలు, మూడు రెవెన్యూ డివిజన్లలో అక్రమ నిర్మాణాలను నివారించడానికి సంబందిత బృందాలు నిరంతరం పర్యవేక్షణ జరపనున్నాయి. రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అధికారులతో జిల్లాస్థాయి బృందాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, సోషల్‌మీడియాల్లో వచ్చే ప్రతీ ఫిర్యాదులపై ఈ కమిటీ సభ్యులు జాయింట్‌గా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటు న్నారు. టీఎస్‌ ఐపాస్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగేతే నివారించడానికి బృందాలు కృషి చేయనున్నాయి. అక్రమ నిర్మాణాలను గుర్తించి ఫొటోలు, వీడియోలు తీసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం వచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు సైతం చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. అక్రమనిర్మాణాల నివారణలపై ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరుపు కోవాలని భవన యజమానులకు అవగాహన కల్పించడంతోపాటు ఉల్లంఘిస్తే చర్యలు సైతం తీసుకునేలా అధికారులు అడుగులు వేస్తున్నారు.

ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు..

 జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల బల్దియాలో అక్రమ నిర్మాణాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కలెక్టర్‌ రవిలకు ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. జగిత్యాల లో సుమారు 150కి పైగా అక్రమ నిర్మాణాలు న్నాయని ఆరోపిస్తూ డిసెంబర్‌ 3న కలెక్టర్‌ రవికి, డిసెంబర్‌ 22న సీఎం కేసీఆర్‌కు, జనవరి 7న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెట రీలకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మెట్‌పల్లి మున్సిపాల్టీలో సుమారు 182కి పైగా అక్రమ నిర్మా ణాలు జరిగాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ మర్రి పోచయ్య, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ యామ రాజయ్య ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫిర్యాదుపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు స్పందించి ప్రత్యేక కమిటీని ఏర్పరిచి విచారణ జరిపిస్తున్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపుకలెక్టర్‌ అరుణశ్రీ సైతం ఈ వ్యవహారంపై దృష్టిసారించి పర్యవేక్షణ జరుపుతున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి మున్సిపాల్టీల్లో పలువురు నిర్మాణదా రులకు అధికారులు నోటీసులు సైతం అందజేశారు. అదే విధంగా ధర్మపురి, రాయికల్‌, కోరుట్ల మున్సిపాల్టీల్లో అక్రమనిర్మాణాలు న్నాయన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతితోనే ఆక్రమణలు..

బల్ధియాల్లో టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చోటు చేసుకుంటున్న అవినీతితోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గతనెల 9న జగిత్యాల మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కొండేటి రాము, లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ గాలసు నాగరాజు, టౌన్‌ప్లానింగ్‌, సిటీ ప్లానర్‌ పిట్టల బాలనందస్వామి ఇంటి నిర్మాణ అనుమతి కొరకు ఓ ప్రైవేటు వైద్యుని వద్ద లంచం తీసు కుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఇంటి నిర్మాణాలకు అనుమతిని ఇవ్వడంలో అధికారులు అవినీతికి పాల్పడుతు న్నారనడానికి జగిత్యాలలో ఏసీబీ దాడుల సంఘ టన అద్దం పడుతోంది. 


నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ కరువు..

 ఇంటి నిర్మాణాలకు అనుమతినిచ్చిన అనంతరం భవనం నిర్మాణం జరుగుతున్న సమయంలో పర్య వేక్షణ జరపడంలో అధికారులు విఫలమవుతున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఖాళీలు, కొరత సైతం సమస్యకు కారణంగా తయారయింది. ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో నామమాత్రంగా తనిఖీలు, చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. కలెక్టర్‌ రవి చొరవ చూపించి అక్రమ నిర్మాణాల నివారణపై దృష్టి సారిస్తుండడంతో ఇకనైనా ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


అక్రమ నిర్మాణాలను అరికట్టాలి..

- మర్రి పోచయ్య, బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్‌, మెట్‌పల్లి

మెట్‌పల్లి మున్సిపాల్టీలో జరుగు తున్న అక్రమనిర్మాణాలను అరిక ట్టాలి. ఫిర్యాదుచేసి నెలలు గడు స్తున్నా అధికారులు చర్యలు తీసు కోవడం లేదు. ఆక్రమణలను గుర్తించడానికి కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ప్రగతి కనిపించడం లేదు. కలెక్టర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు దృష్టికి కూడా సమస్యను తీసుకవెళ్లాం. అయినా ఎలాంటి ఫలితం లేదు.


Updated Date - 2021-03-04T06:51:37+05:30 IST