ఉక్కు ఉద్యమ ఉధృతికి కార్యాచరణ

ABN , First Publish Date - 2021-02-28T06:45:57+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామనే ప్రకటన నుంచి ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులు, నిర్వాసితులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.

ఉక్కు ఉద్యమ ఉధృతికి కార్యాచరణ

వచ్చే నెలలో నిరసన కార్యక్రమాలు ఖరారు

ఉక్కుటౌన్‌షిప్‌, ఫిబ్రవరి 27: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామనే ప్రకటన నుంచి ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులు, నిర్వాసితులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 12 నుంచి స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదేవిధంగా మార్చి నెలలో కూడా చేయలని నిర్ణయించారు. ఈసారి నిరసన దీక్షలో ఉక్కు ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికులు, మహిళా ఉద్యోగులు, పదవీ విరమణ ఉద్యోగులు కూడా భాగస్వామ్యులు కానున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఆయా తేదీల్లో విభాగాల వారీగా చేపట్టనున్నారు. 

మార్చి 1న బ్లాస్ట్‌ఫర్నేస్‌, 2న ఎస్‌ఎంఎస్‌-1, 3న సీవోసీసీపీ, సీఆర్‌జీ,  4న సింటర్‌ప్లాంట్‌, 5న ఆర్‌ఎంహెచ్‌పీ, 6న టీపీపీ, సీపీపీ-2, పీఈఎం, ఆర్‌ఎండీ, సీఈడీ, ల్యూబ్‌, టెక్‌, సర్వీసెస్‌, ల్యూబ్రికేంట్స్‌, 7న పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మన్‌,  ఐటీ అండ్‌ ఈఆర్‌పీ, హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌, సీఎస్‌ఆర్‌, పిపిఎం, 8న యూటీలీటీస్‌, ఈఎండీ, ఈఎన్‌ఎండీ, డబ్ల్యూఎండీ, 9న ఇన్‌స్ట్రుమెంటేషన్‌, క్యూఏటీడీ, డీఎన్‌డబ్ల్యూ, ఆర్‌అండ్‌డీ, 10న ఈఎస్‌అండ్‌ఎఫ్‌, ఈఆర్‌ఎస్‌, యూఈఆర్‌ఎస్‌, 11న ఎఫ్‌ఎండీ, సీఆర్‌ఎంపీ, ఆర్‌ఈడీ, ఎస్‌ఎస్‌డీ, 12న సీఎంఎం, సీఎంఈ, టెలికాం, ఈటీఎల్‌, ఏసీఎస్‌, 13న  ఎల్‌ఎంఎం, ఎస్‌బీఎం, ఆర్‌ఎస్‌అండ్‌ ఆర్‌ఎస్‌, డబ్ల్యూఆర్‌ఎం-1, 14న ట్రాఫిక్‌, కన్‌స్ట్రక్షన్స్‌, డిఅండ్‌ఈ, హెచ్‌ఆర్‌డీ, భద్రత, ఎస్‌టీఈడీ, వర్క్స్‌ కాంట్రాక్ట్సు, పీడీ, 15, 16, 17, 18, 19న అన్ని కాంట్రాక్టు కార్మిక సంఘాలు, 20న  ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టీఎం, డబ్ల్యూఆర్‌ఎం-2, 21న ఉక్కు పదవీ విరమణ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, 22న ఎస్‌ఎంఎస్‌-2, 23న బ్లాస్ట్‌ఫర్నేస్‌, 24న సీవోసీసీపీ, సీఆర్‌జీ, 25న ఎస్‌ఎంఎస్‌-1, 26న సెంట్రల్‌ స్టోర్స్‌, టౌన్‌ అడ్మిన్‌, వీఎస్‌జీహెచ్‌, టీటీఐ, ఆగ్రో ఫారెస్టు, అడ్మిన్‌ బిల్డింగ్‌, 27న సింటర్‌ప్లాంట్‌, 28న పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, ఐటీ, హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌, సీఎస్‌ఆర్‌, పీపీఎం, 29న ఆర్‌ఎంహెచ్‌పీ, 30న టీపీపీ, సీపీపీ-2 పీఈఎం, ఆర్‌ఎండీ, సీఈడీ, ల్యూబ్‌, హైడ్రా, టెక్‌, సర్వీసెస్‌, 31న యుటీలీటీస్‌, ఈఎండీ, ఈన్‌ఎండీ, డబ్ల్యూఎండీ విభాగాలు. 


Updated Date - 2021-02-28T06:45:57+05:30 IST