ఉక్కు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

ABN , First Publish Date - 2021-03-03T06:23:36+05:30 IST

పోరాటాలతోనే విజయం వరిస్తుందని సీపీఎం నాయకుడు గంగారామ్‌ అన్నారు.

ఉక్కు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

సీపీఎం నాయకుడు గంగారామ్‌

కూర్మన్నపాలెం, మార్చి 2: పోరాటాలతోనే విజయం వరిస్తుందని సీపీఎం నాయకుడు గంగారామ్‌ అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కూర్మన్నపాలెంలో 19వ రోజు రిలే నిరాహార దీక్షలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ  ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని, ఆయన ఆకాంక్షలు నెరవేరకుండా ఉండాలంటే కార్మికులు ఐకమత్యంతో పోరాడాలన్నారు. రిటైర్డు టీచర్‌  తాతాజీ మాట్లాడుతూ ప్రభుత్వరంగమైన స్టీల్‌ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ప్రభుత్వం అమ్మకాల వైపు నడవటం బాధాకరమన్నారు. కార్మిక నేత బోసుబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ముంచే విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, ముత్యాలు, మురళీ రాజు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T06:23:36+05:30 IST