స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-08-03T05:29:35+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండులో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీఐటీయూ నగర కార్యదర్శి టీ మహేష్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ మజుందార్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్‌చౌదరి మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు అయిందని, అటువంటి ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం తగదన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
అద్దంకి బస్టాండులో నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాలు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 2 :  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండులో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీఐటీయూ నగర కార్యదర్శి టీ మహేష్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ మజుందార్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్‌చౌదరి మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు అయిందని, అటువంటి ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలనువెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి వీరస్వామిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులు జీవీ కొండారెడ్డి, దామాశ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, ఎస్‌డీ హుస్సేన్‌, సీహెచ్‌ రమాదేవి, ఎస్‌డీ సర్దార్‌, సుభాన్‌నాయుడు, కే అంజయ్య, బి. హరికృష్ణ, కంకణాల రమాదేవి, ఎస్‌కే అజిత్‌, కేఎ్‌ఫబాబు, కే గోపీ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-03T05:29:35+05:30 IST