ఆ నలుగురు... దశ మార్చుతారా?

ABN , First Publish Date - 2021-06-17T03:55:31+05:30 IST

అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం, ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లోనూ అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ఆ నలుగురు... దశ మార్చుతారా?




 అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు 

 జిల్లాకు నలుగురు జేసీలు  

(కలెక్టరేట్‌)

అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం, ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లోనూ అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు నలుగురు జాయింట్‌ కలెక్టర్లు చొప్పున నియమించింది. తాజాగా ఇటీవల గృహ నిర్మాణ శాఖకు కూడా జేసీని నియమించి.. బాధ్యతలు అప్పగించింది. గతంలో జిల్లాకు కలెక్టర్‌తో పాటు ఒక జాయింట్‌ కలెక్టర్‌ మాత్రమే ఉండేవారు. తర్వాత టీడీపీ హయాంలో జాయింట్‌ కలెక్టర్‌ను నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముగ్గురు జేసీలను నియమించింది. రెవెన్యూ శాఖ సేవల పర్యవేక్షణ ఒకరికి... సచివాలయాలకు సంబంధించి మరొకరికి... సంక్షేమ పథకాల అమలు బాధ్యతలను ఇంకొక జాయింట్‌ కలెక్టర్‌లకు అప్పగించింది. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి తాజాగా జాయింట్‌ కలెక్టర్‌-4ను నియమించింది. ఇకపై జిల్లాలో కలెక్టర్‌తో పాటు నలుగురు జేసీ ల ఆధ్వర్యంలో పరిపాలన ముందుకు సాగనుంది.  ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నా, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచే అన్ని రకాల సేవలు ప్రజలకు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు తమకు సక్రమంగా అందడం లేదని శ్రీకాకుళం లోని కలెక్టరేట్‌లో ‘స్పందన’తో పాటు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలకు అనేక మంది ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. జియోట్యాగింగ్‌ మేరకు బిల్లులు చెల్లించాలనే విధానం అమల్లో ఉన్నందున గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాం తాల్లో కూడా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే బిల్లులు అందుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులకు సక్రమంగా బిల్లులు మం జూరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా గృహ నిర్మాణశాఖ జేసీగా బాధ్యతలు స్వీకరించిన హిమాంశు కౌశిక్‌ తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కలెక్టర్‌తో పాటు నలుగురు జేసీలు పాలన గాడిన పెట్టేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

 



Updated Date - 2021-06-17T03:55:31+05:30 IST