కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన స్టీవ్ స్మిత్

ABN , First Publish Date - 2022-03-23T01:56:38+05:30 IST

ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో ఘనత సాధించాడు. పాకిస్థాన్‌తో ఆ దేశంలో జరుగుతున్న

కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన స్టీవ్ స్మిత్

లాహోర్: ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో ఘనత సాధించాడు. పాకిస్థాన్‌తో ఆ దేశంలో జరుగుతున్న టెస్టుల్లో నిలకడగానే ఆడుతున్నప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతున్న స్మిత్ రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో 78, కరాచీలో జరిగిన రెండో వన్డేలో 72 పరుగులు చేశాడు.


తాజాగా, లాహోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో 59 పరుగులు చేసి మరో అర్ధ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. వీటితో కలుపుకుని స్మిత్ ఇప్పటి వరకు చేసిన పరుగుల సంఖ్య 7,933కు చేరింది. ఫలితంగా 150 టెస్టుల ఇన్నింగ్స్‌లలో 7,913 పరుగులు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును అధిగమించాడు. వీరి తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (7,869), వీరేంద్ర సెహ్వాగ్ (7,694), రాహుల్ ద్రవిడ్ (7,680) ఉన్నారు. 

Updated Date - 2022-03-23T01:56:38+05:30 IST