స్టాక్ మార్కెట్... భారీ నష్టాలు... లాభాలు...

ABN , First Publish Date - 2021-04-23T22:38:37+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకొచ్చాయి.

స్టాక్ మార్కెట్... భారీ నష్టాలు... లాభాలు...

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకొచ్చాయి. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగియగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపధ్యంలో దేశంలో... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కలవరానికి కారణమవుతోంది. ప్రాఫిట్ బుకింగ్ కనిపించడంతో... ఈ రోజు మార్కెట్లు పేలవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో నష్టపోయిన కీలక రంగాలు... గంటన్నర తర్వాత కాస్త లాభాల్లోకొచ్చాయి.


నష్టాల నుండి లాభాల్లోకి...

సెన్సెక్స్ ఉదయం 47,863.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,265.39 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,743.43 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ 116.24(0.24%) పాయింట్లు ఎగసి 48,199.51 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 48,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత ఈ మార్కును దాటింది. నిఫ్టీ 14,326.35 పాయింట్ల వద్ద ప్రారంభమై... 14,461.15 వద్ద గరిష్టాన్ని, 14,319.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి నిఫ్టీ 21.20(0.15%) పాయింట్లు ఎగసి 14,427.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.


టాప్ గెయినర్స్, లూజర్స్...

మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.28 శాతం, ఎన్‌టీపీసీ 2.78 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.54 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.30 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.80 శాతం మేర లాభపడ్డాయి.


టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 1.57 శాతం, బ్రిటానియా 1.60 శాతం, హెచ్‌యూఎల్ 1.23 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.19 శాతం, శ్రీ సిమెంట్స్ 1.12 శాతం నష్టపోయాయి. ఇక మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.


Updated Date - 2021-04-23T22:38:37+05:30 IST