ఆటుపోట్లకు అవకాశం

ABN , First Publish Date - 2021-04-19T06:12:38+05:30 IST

మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి...

ఆటుపోట్లకు అవకాశం

మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. శ్రీరామనవమి సందర్భం గా బుధవారం మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ వారం నిఫ్టీ 14700-14850 మధ్య నిలకడగా సాగితే అప్‌ట్రెండ్‌ను కనబరిచే వీలుంది. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌లోకి సాగితే 14500- 14250 స్థాయిలకు పడిపోయే అవకాశం ఉంది. 


స్టాక్‌ రికమండేషన్స్‌

స్ట్రైడ్స్‌ ఫార్మా: గడిచిన ఏడాది కాలంగా ఈ షేరు వివిధ ధరల శ్రేణుల్లో కదలాడుతూ వస్తోం ది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఫార్మా షేర్ల ర్యాలీలో ఈ కంపెనీ షేరు నిలదొక్కుకోలేకపోయిం ది. అయితే ఎట్టకేలకు గత శుక్రవారం   అనిశ్చిత ధోరణికి ముగింపు పలికింది. వాల్యూమ్స్‌ కూడా ఆశించిన స్థాయిల్లో ఉన్నాయి. గత శుక్రవారం రూ.922.15 వద్ద క్లోజైన ఈ షేరు.. రానున్న రోజుల్లో రూ.912- 907 స్థాయికి చేరితే రూ.992 టార్గెట్‌ ధరతో దీర్ఘకాలానికి కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.872 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

గ్రాసిమ్‌: డైలీ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరులో స్వల్పకాలిక కరెక్షన్‌ కనిపిస్తోంది. కొన్ని నెలల తర్వాత తొలిసారిగా బేరి్‌షక్రాస్‌ ఓవర్‌తో 20 ఈఎంఏ దిగువకు చేరింది. గత శుక్రవారం రూ.1,353.20 వద్ద క్లోజైన షేరును రూ.1,270 ధర ను టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించటం బెటర్‌. అయితే రూ.1,402 స్థాయిని మాత్రం కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

         - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,  టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌



నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2021-04-19T06:12:38+05:30 IST