గుట్కా దందా జోరు

ABN , First Publish Date - 2020-09-24T08:37:33+05:30 IST

కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నిషేధిత గుట్కా, తంబాకు విచ్చల విడిగా నిజామాబాద్‌ జిల్లాకు రవాణా అవుతోంది

గుట్కా దందా జోరు

కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సరఫరా

నిజామాబాద్‌లోని ప్రత్యేక కేంద్రాల్లో నిల్వలు

గత కొన్ని రోజులుగా టాస్క్‌ఫోర్స్‌ దాడులు

భారీగా పట్టుబడుతున్న గుట్కా


నిజామాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నిషేధిత గుట్కా, తంబాకు విచ్చల విడిగా నిజామాబాద్‌ జిల్లాకు రవాణా అవుతోంది. రాష్ట్రాల సరి హద్దుల వద్ద తమకు ఉన్న పరిచయాలతో పెద్ద ఎత్తున గుట్కా ను తరలిస్తున్నారు. రాత్రివేళల్లో ఎక్కువగా ఈ దందా కొనసా గుతోంది. జిల్లాలోని మారుమూల పల్లెల వరకు ఉన్న దుకాణా లు, పాన్‌ డబ్బాలకు ఈ గుట్కాను చేరవేస్తున్నారు. జిల్లాలో నిత్యం లక్షల రూపాయల గుట్కా అమ్మకాలను కొనసాగిస్తున్నా రు. గడిచిన వారం రోజులుగా టాస్క్‌ఫోర్స్‌దాడుల్లో లక్షలాది రూపాయల గుట్కా బయట పడుతుండటంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. అసలైన కింగ్‌పిన్‌లను, నిల్వ చేసిన ప్రాంతాలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన కొన్ని నెలలుగా నిషేధిత గుట్కా, తంబాకు వ్యాపారం జోరుగా సాగుతోంది.  కరోనా సమయంలో వీటి అమ్మకాలు పెరగడంతో ఎక్కువగా జిల్లాకు తీసుకవస్తున్నారు.


మహారాష్ట్రలోని నాందేడ్‌, ఇతర ప్రాంతాల కన్నా కర్ణాటకలోని గుల్బర్గాలో తక్కువ రేటుకు లభిస్తుండడం తో అక్కడ నుంచే ఎక్కువగా తీసుకవస్తున్నారు. జిల్లాకు వస్తు న్న గుట్కాలో రాణి, విమల్‌, సాగర్‌, అంబర్‌తో పాటు ఇతర పేర్లతో ఉండే గుట్కాలు ఎక్కువగా అమ్ముడు అవుతున్నా యి. ప్రభుత్వం వీటిని నిషేధించినా వారికి తెలిసిన మార్గాల ద్వారా వీటిని తరలిస్తున్నారు. ఈ గుట్కాతో పాటు తంబాకు, జర్ధాను కూడా తీసుకవచ్చి అమ్మకా లు చేస్తున్నారు.ఈ గుట్కా, తంబాకుకు నగరమే అడ్డాగా కొనసాగుతోంది.


కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి గుట్కాను తీసుకవచ్చి నగరంలో నే నిల్వ ఉంచుతున్నారు. డిమాండ్‌ను బట్టి దుకాణాలకు, పాన్‌ డబ్బాలకు చేరవేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకవచ్చేట ప్పుడు ఎక్కడా కూడా సరుకు పట్టుపడకుండా చూసుకుంటు న్నారు. అన్ని చోట్ల తమకు అనుకూలంగా ఉన్న వారిని పెట్టి మేనేజ్‌ చేస్తున్నారు. కొన్ని చోట్ల సరుకు తీసుకవచ్చినప్పుడు డబ్బులు ఇస్తూ పట్టుబడకుండా చూసుకుంటున్నారు. నగరం తో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో నిల్వ ఉంచుతున్నారు. దుకాణాల నుంచి సమాచారం రాగానే చేరవేస్తున్నారు. గుట్కా దుకాణాలు, పాన్‌ డబ్బాలకు చేరవేసేందుకు ద్విచక్ర వాహనా లు ఉపయోగిస్తున్నారు.


తమ వ్యాపారానికి ఇబ్బందులు రాకుం డా చూసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహా యం తీసుకుని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నా యి. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నగరం పరిధిలో గడిచిన పది రోజులుగా టాస్క్‌ఫోర్సు ఆధ్వర్యంలో ప్రతీరోజు లక్షలు విలువ చేసే గుట్కా పట్టుకుంటున్నారు. ప్రతీచోట భారీగానే గుట్కా దొరుకుతోంది. నగరంలోని పులాంగ్‌ సమీపంలోని ఓ ఇంట్లో భారీగా గుట్కాను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బుధవారం పట్టుకు న్నారు. ఈ సరుకు రూ.మూడు లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతీరోజు పట్టుకుంటున్నా.. పోలీసులు కేసులు నమోదు చేసినా.. గుట్కా అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. కర్ణాటకలోని గుల్బార్గా నుంచి జిల్లాకు ఎక్కువగా వస్తోందని టాస్క్‌ఫోర్స్‌ సీఐ షాకీర్‌అలీ తెలిపారు. తమకు వస్తోన్న సమాచారం ప్రకారం పట్టుకుంటున్నామని తెలిపారు. నగరం పరిధిలోనే ఎక్కవగా దొరుకుతుందన్నారు. ఇక్కడి నుంచే గ్రామాలకు చేరవేస్తున్నారని తెలిపారు. అన్ని ప్రాంతా లలో ఈ నిషేధిత గుట్కాపై పోలీసులు, ఇతర శాఖల అధికారులు నిఘాపెడితే కొంత వరకు ఆగే అవకాశం ఉంది.


Updated Date - 2020-09-24T08:37:33+05:30 IST