ఆ రెండు ఎయిర్‌లైన్స్... విలీనంపై వాటాదారుల ఓటు వాయిదా

ABN , First Publish Date - 2022-07-01T01:40:33+05:30 IST

స్పిరిట్ ఎయిర్‌లైన్స్... ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌తో తన ప్రతిపాదిత విలీనంపై వాటాదారుల ఓటును జూలై 8 కి వాయిదా వేసింది.

ఆ రెండు ఎయిర్‌లైన్స్...   విలీనంపై వాటాదారుల ఓటు వాయిదా

ఫ్లోరిడా : స్పిరిట్ ఎయిర్‌లైన్స్... ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌తో తన ప్రతిపాదిత విలీనంపై వాటాదారుల ఓటును జూలై 8 కి వాయిదా వేసింది. ఈ రోజు(గురువారం) జరగాల్సిన సమావేశానికి గంటల ముందు వాయిదా ప్రకటన వెలువడింది. స్పిరిట్... ఫ్రాంటియర్‌తో దాని ప్రణాళికాబద్ధమైన విలీనానికి సంబంధించి... ఓటు వేయడాన్ని ఆలస్యం చేయడం ఇది రెండవసారి.


స్పిరిట్ వాస్తవానికి గురువారం నాటి ఓటును జూన్ 10 న షెడ్యూల్ చేసినప్పటికీ, ఆయా కారణాల నేపథ్యంలో ఆలస్యం చేసింది. కాగా... ఫ్రాంటియర్, జెట్‌బ్లూ రెండూ కూడా  షెడ్యూల్ చేసిన ఓటుకు వారం ముందు తమ ఆఫర్‌లను పెంచాయి. ఫ్రాంటియర్, స్పిరిట్ విలీనం చేయాలనే ఉద్దేశాన్ని మొదట ఫిబ్రవరిలో వెల్లడించాయి. ఏప్రిల్‌లో, జెట్‌బ్లూ... స్పిరిట్‌ టేకోవర్‌కు సంబంధించి ఆశ్చర్యకరమైన బిడ్‌ను దాఖలు చేసింది.


కాగా... స్పిరిట్ బోర్డు జెట్‌బ్లూ ఆఫర్‌లను పదేపదే తిరస్కరించింది. కాగా... గురువారం ఉదయం ట్రేడింగ్‌లో స్పిరిట్ షేర్లు 3% కంటే ఎక్కువ పెరిగడం, జెట్‌బ్లూ 5% కంటే ఎక్కువ తగ్గడం జరిగింది. ఫ్రాంటియర్ స్టాక్ దాదాపు 2% పడిపోయింది. 

Updated Date - 2022-07-01T01:40:33+05:30 IST