1000 ఏళ్లుగా ఈ రాయిలో భూతం బందీ.. ఇన్నాళ్లకు రెండు ముక్కలు కావడంతో..

ABN , First Publish Date - 2022-03-08T18:06:08+05:30 IST

ఈ ప్రపంచంలో రహస్యాలకు అంతులేదు.

1000 ఏళ్లుగా ఈ రాయిలో భూతం బందీ.. ఇన్నాళ్లకు రెండు ముక్కలు కావడంతో..

ఈ ప్రపంచంలో రహస్యాలకు అంతులేదు. చాలా రహస్యాలు ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద దెయ్యాలు ఉండేవనే కథనాలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు అటువంటి వాటిని ఎవరూ నమ్మడం లేదు. జపాన్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక పురాతన బండరాయిలో భూతం బందీ అయిందని చెబుతారు. ఇప్పుడు ఈ పురాతన బండరాయి రెండు ముక్కలయ్యింది. ఇది రాక్షస శక్తుల వల్ల జరిగిందని  స్థానికులు నమ్ముతారు. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం, సెషో సెకి అకా ది కిల్లింగ్ స్టోన్‌గా ప్రసిద్ధి చెందిన ఈ బండరాయి అగ్నిపర్వత శిల. ఈ రాయిలో వెయ్యి ఏళ్లుగా దుష్టాత్మ ఉందని స్థానికులు నమ్ముతారు. 


జపనీస్ పురాణాల ప్రకారం కూడా ఈ రాయిలో ఒక దుష్ట ఆత్మ నివసిస్తుందని చెబుతారు. ఇది చాలా శక్తివంతమైనదని, అది తన పరిధిలోకి వచ్చినవారికి చంపుతుందని చెబుతారు. కాగా రాయిని రెండు భాగాలుగా విభజించినప్పుడు, దానిలో నుంచి విషపూరిత వాయువు రావడం ప్రారంభమైంది. ఇటీవలే ఈ శిలను రెండు భాగాలుగా విభజించారు. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాయి నుంచి విష వాయువు నిరంతరం వెలువడుతోంది. కిల్లింగ్ స్టోన్‌లో టమామో-నో-మే శవం ఉందని చెబుతారు. జపనీస్ పురాణాల ప్రకారం టమామో-నో-మే శక్తివంతమైన జపనీస్ భూస్వామ్య ప్రభువు కోసం పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అతను టోబా చక్రవర్తిని ఓడించడానికి పథకం పన్నాడని, ఈ రాయిలో అతని మృతదేహం ఉందని చెబుతారు. ఇప్పుడు రాయి పగులగొట్టినట్లు తెలియడంతో చాలామంది సోషల్ మీడియాలో తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-03-08T18:06:08+05:30 IST