Gujarat: గుజరాత్ రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు

ABN , First Publish Date - 2022-08-30T16:36:55+05:30 IST

గుజరాత్(Gujarat) రాష్ట్రంలో మళ్లీ సోమవారం రాత్రి అల్లర్లు(communal tension)...

Gujarat: గుజరాత్ రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు

గణేష్ ఊరేగింపులో రాళ్లు రువ్వుకున్న రెండు వర్గాలు...13మంది అరెస్ట్ 

వడోదర(గుజరాత్): గుజరాత్(Gujarat) రాష్ట్రంలో మళ్లీ సోమవారం రాత్రి అల్లర్లు(communal tension) చెలరేగాయి.వడోదర(Vadodara) నగరంలోని సున్నిత ప్రాంతం మీదుగా సోమవారం రాత్రి గణేష్ విగ్రహాన్ని సున్నిత ఊరేగింపుగా(Ganesh procession) తీసుకువెళుతుండగా రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.(Stone pelting) గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రాళ్లు రువ్వుకున్న ఘటనతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.(heavy police force was deployed) గణేష్ విగ్రహాన్ని శాంతియుతంగా మండపం వద్దకు తరలించారు. రాళ్లు రువ్వుకున్న ఘటనపై రెండు వర్గాలకు చెందిన 13మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని వడోదర పోలీసులు( Vadodara city police station) చెప్పారు.


 రాళ్లు రువ్వుకున్న ఘటనలో ఎవరూ గాయపడలేదని, దీనిపై ఐపీసీ 143, 147,336,295 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. పానీగేట్ దర్వాజా వద్ద గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మసీదు (mosque)ప్రధాన గేటు వద్ద ఉన్న గ్లాసులు పగిలాయి.శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వడోదరలో పోలీసు పెట్రోలింగ్ పెంచారు. వడోదరలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని వడోదర జాయింట్ సీపీ(Joint Commissioner of Police) చిరాగ్ కొరాడియా చెప్పారు.రెండు వర్గాలవారు రాళ్లు రువ్వుకున్న ఘటనపై క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని జాయింట్ సీపీ వివరించారు. 


Updated Date - 2022-08-30T16:36:55+05:30 IST