పన్ను పెంపు నిర్ణయాన్ని మానుకోవాలి

Jun 16 2021 @ 22:08PM
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

గూడూరురూరల్‌, జూన్‌ 16: ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని మానుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపు, చెత్తసేకరణకు పన్ను విధిస్తూ జీవోలు విడుద చేయడం మంచిపద్ధతి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోలను రద్దు చేయాలన్నారు. అనంతరం కమిషనర్‌ రఘుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఇండ్ల హేమచంద్ర, బిందురెడ్డి, ప్రభాకర్‌, రాజేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, జీవీనాయుడు, నరేంద్ర, శివప్రసాద్‌, మణికంఠ, సాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.