తెల్ల రేషన్‌ కార్డుదారులకు నిలిచిపోయిన కిరోసిన్ సరఫరా

ABN , First Publish Date - 2021-01-17T05:21:47+05:30 IST

నీలికిరోసిన్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్యాస్‌ కనెక్షన్‌ లేని కుటుంబాలు ఆందోళన చెందుతుండగా.. కిరోసిన్‌ పంపిణీ చేసే హాకర్లు ఉపాధి కోల్పోయి ప్ర త్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నారు.

తెల్ల రేషన్‌ కార్డుదారులకు నిలిచిపోయిన కిరోసిన్ సరఫరా

గతంలోనూ గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారికే పంపిణీ

ప్రభుత్వం నుంచి సరఫరా లేని పరిస్థితి

ఉపాధి కోల్పోయిన హాకర్లు

కామారెడ్డి, జనవరి 16: నీలికిరోసిన్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్యాస్‌ కనెక్షన్‌ లేని కుటుంబాలు ఆందోళన చెందుతుండగా.. కిరోసిన్‌ పంపిణీ చేసే హాకర్లు ఉపాధి కోల్పోయి ప్ర త్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నారు. తెల్ల రేష న్‌ కార్డు దారులకు పౌర సరఫరాలశాఖ ద్వారా ఏడా ది కాలంలోగా గ్యాస్‌ కనెక్షన్‌లేని కుటుంబాలకు మా త్రమే కిరోసిన్‌ పంపిణీ చేశారు. అయితే ఆ తర్వాత పూర్తిగా కిరోసిన్‌ సరఫరాను నిలిపివేశారు. ఆగస్టు నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి నీలి కిరోసి న్‌ను సరఫరా చేయడం లేదు. దీంతో అప్పటినుంచి ప్రతి నెలా సుమారు లక్ష లీటర్ల కిరోసిన్‌ మాత్రమే సరాఫరా చేశారు. జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు లేని వారు 98,353 మంది ఉండగా 22,383 దీపం కనెక్షన్‌ ఉన్న లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలనెలా డీలర్లు, హాకర్ల ద్వారా కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నారు.

తగ్గుతూ వచ్చిన కోటా

2016 కంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కిరోసిన్‌ను పంపిణీ చేసేవి. తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి రెండు లీటర్ల చొప్పున కిరోసిన్‌ పం పిణీ చేశారు. అనంతరం నీలి కిరోసిన్‌ సరఫరాను ప్ర భుత్వం తగ్గిస్తూ వచ్చింది. తెల్ల రేషన్‌కార్డుదారులకు లీటర్‌ కిరోసిన్‌ సరాఫరా చేశారు. 2019 ఆగస్టు నుం చి గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారికి ఒక లీటరు చొప్పున కిరో సిన్‌ సరాఫరా చేశారు. అప్పటి నుంచి జిల్లాకు కేవ లం 94,860 లీటర్ల కిరోసిన్‌ మాత్రమే సరాఫరా చేశా రు. అనంతరం ఏడాది ఆగస్టు నుంచి కిరోసిన్‌ సరఫ రాను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిలిపివేసింది. దీంతో క్షేత్రస్థాయిలో పంపిణీ ఆగిపోయింది. ఈ కారణంగా కేవలం కిరోసిన్‌పై ఆధారపడ్డ తెల్ల రేషన్‌ కార్డుదారు లకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్‌ కనెక్షన్‌ లే కుండా రాయితీ కిరోసిన్‌ను ఉపయోగించుకుంటున్న నిరుపేదలు తమకు కిరోసిన్‌ కోటాను సరాఫరా చే యాలని కోరుతున్నారు.

ప్రత్యామ్నాయ ఉపాధి వైపు హాకర్లు

నీలి కిరోసిన్‌ సరాఫరాను ప్రభుత్వం నిలిపివేయ డంతో హాకర్లు ఉపాధి కోల్పోయారు. 40 ఏళ్లుగా ఇదే వృత్తిగా ఎంచుకున్న హాకర్లు నీలి కిరోసిన్‌ను ప్రతినె లా వినియోగదారులకు సరాఫరా చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో కిరోసిన్‌ కోటాను తగ్గించారు. కేవలం 94,860 లీటర్ల కిరోసిన్‌ మాత్రమే జిల్లాకు పంపి ణీ చేశారు. అంతకుముందు హాకర్లకు ఎక్కువ మొత్తంలో కిరోసిన్‌ రావడంతో పంపిణీ చేయడం వారికి సు లువుగా ఉండేది. ఒక్కో లీటర్‌ కు పావలా కమీషన్‌ ఇచ్చేవా రు. అయితే కోటా తగ్గించిన క్రమంలో ఒక్కో హాకర్‌కు 50 నుంచి 100 లీటర్లకు మించి రాకపోవడంతో ఆ కిరోసిన్‌ను పంపిణీ చేయడం తలకు మిం చిన భారంగా తయారైంది. తమ ప్రాంత పరిధిలో హాకర్లు కిరోసిన్‌ పంపిణీ చేసేందుకు అయ్యే ఖర్చు కూ డా కమీషన్‌ రూపంలో రాకపోవడంతో కిరోసిన్‌ పంపిణీ చేయ డానికి విముఖత చూ పారు. అనంతరం కిరోసిన్‌ సరాఫరా పూర్తిస్థాయిలో కాకపోవడంతో హాకర్లు ప్రస్తు తం తప్పని సరి పరిస్థి తిలో ప్రత్యా మ్నాయం వైపు చూ స్తున్నారు.

కిరోసిన్‌ రావడం లేదు..

కొండల్‌రావు, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి, కామారెడ్డి

ప్రభుత్వం నుంచి ఆరు నెలలుగా కిరోసిన్‌ రావ డం లేదు. దీంతో మేము రాయితీపై సరాఫరా చేసే కిరోసిన్‌ను పంపిణీ చేయలేకపోతున్నాం. ప్రభుత్వ ం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని అమ లుచేస్తాం.

Updated Date - 2021-01-17T05:21:47+05:30 IST