BIG BREKING: పోలవరం పనులు నిలిపివేత

ABN , First Publish Date - 2022-03-23T01:08:15+05:30 IST

పోలవరం పనులు పూర్తి చేస్తామని సీఎం చెప్పిన గంటలోనే

BIG BREKING: పోలవరం పనులు నిలిపివేత

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని సీఎం చెప్పిన గంటలోనే ప్రాజెక్టు పనులను నిర్మాణ సంస్థ నిలిపివేసింది. ఈ రోజు మధ్యాహ్నం పోలవరం పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ నిలిపివేసింది. పోలవరం పనుల కోసం గోదావరిలో ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మెగా ఇంజనీరింగ్ టిప్పర్లకు ఇసుక ఇవ్వడాన్ని జేపీ వెంచర్స్ ఆపేసింది. ఇసుక తవ్వుకునేందుకు వీలు లేదని, డబ్బు కట్టాల్సిందేనని కాంట్రాక్టు సంస్థ చెప్పింది. తమకు అనుమతులు ఉన్నాయని పోలవరం నిర్మాణ సంస్థ  చెప్పింది. డబ్బు చెల్లించకుండా ఇసుక సరఫరా చేసేది లేదని జెపీ వెంచర్స్ తేల్చి చెప్పింది. ఇసుక ఇవ్వకపోవడంతో టిప్పర్లు వెనక్కి వచ్చాయి. ప్రభుత్వానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు ఈ సమాచారాన్ని పంపారు. 


Updated Date - 2022-03-23T01:08:15+05:30 IST