ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ‘స్టోరేజ్‌’ మిస్టేక్స్‌

ABN , First Publish Date - 2022-05-21T07:07:24+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో చాలావరకు 64 జీబీ మేర స్టోరేజీ సదుపాయం ఉంటోంది. అయితే యూజర్లు తరచుగా చేసే తప్పుల కారణంగా ఈ స్టోరేజీ కొద్దికాలానికే నిండిపోయి ఇబ్బందులు పడుతుంటారు.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో  ‘స్టోరేజ్‌’ మిస్టేక్స్‌

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో చాలావరకు 64 జీబీ మేర స్టోరేజీ సదుపాయం ఉంటోంది. అయితే యూజర్లు తరచుగా చేసే తప్పుల కారణంగా ఈ స్టోరేజీ కొద్దికాలానికే నిండిపోయి ఇబ్బందులు పడుతుంటారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని కరెక్ట్‌గా ఉపయోగించడం తెలియకపోవడమే అసలు సమస్య. కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలు, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో స్టోరేజీ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. అవేటో చూద్దాం...


ఫొటోలు, వీడియోలు చాలా ఎక్కువ స్పేస్‌ను ఫోన్లలో తినేస్తాయి. క్లౌడ్‌ స్టోరేజీ  సర్వీసులైన ‘గూగుల్‌ ఫోటో   ్‌స’లో ఫొటోలు, వీడియోలను సేవ్‌ చేసుకోవాలి. ప్రతి గూగుల్‌ అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికి 15 జీబీ మేర ఉచితంగా అందులో సేవ్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఒక్కసారి అందులోకి పంపేస్తే, బ్యాకప్‌ కాపీలను వైఫై లేదా మొబైల్‌ డేటా సహాయంతో వెనక్కు తెచ్చుకోవచ్చు. 

చాలా మంది ఫోన్లను పీసీలుగా ఉపయోగించుకుంటున్న రోజులివి. ఆఫీస్‌ ఫైల్స్‌ నుంచి మీడియా వరకు చాలా వాటికి యాక్సెస్‌ కూడా ఉంటుంది. అవసరమైన వాటన్నింటినీ ఫోన్లోనే ఉంచుకుంటే స్టోరేజీ ఎంత ఉన్నా సరిపోదు. గూగుల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ వన్‌ డ్రైవ్‌ తదితర క్లౌడ్‌ స్టోరేజీ సర్వీసుల్లోకి పంపుకోవాలి తప్ప ఉంచుకోకూడదు. 

రెగ్యులర్‌గా డౌన్‌లోడ్‌ చేసుకునే సినిమాలు, మ్యూజిక్‌, ఇతర మీడియాను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేయాలి. గూగుల్‌ ప్లే నుంచి డిలీట్‌ చేసేందుకు సదరు యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అలాగే ఆ కంటెంట్‌ ఉన్నది తీసుకోవాలి.  మెనూ టాప్‌ - సెట్టింగ్స్‌ - మేనేజ్‌ డౌన్‌లోడ్స్‌ - డౌన్‌లోడ్‌ డౌన్‌లోడ్‌ - అప్పుడు రిమూవ్‌. ఇతర సోర్సులతో పొందే కంటెంట్‌ డిలీట్‌ కోసం, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఉపయోగించిన యాప్‌ను డిలీట్‌ చేయాలి. 


ఉపయోగించని యాప్స్‌ను డిలీట్‌ చేసేయాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ని కొనుగోలు చేసుకుని ఉంటే మాత్రం మళ్ళీసారి కొనుక్కోకూడదు.

సాధారణంగా యాప్‌ కేచే, డేటాను ఫోన్‌లో ఉన్న సెట్టింగ్స్‌ యాప్‌తో క్లియర్‌ చేస్తూ ఉంటారు. ఇది తాత్కాలిక డేటాను మాత్రమే తొలగిస్తుంది. మోడల్‌ని బట్టి సెట్టింగ్స్‌ కూడా మారుతుంటాయి. 

వాట్సాప్‌ ఈ మధ్యకాలంలో పలువురి జీవితంలో భాగమైంది. తద్వారా వచ్చిన ఫొటోలు తదితరాలు ఫోన్‌ గ్యాలరీలోకి చేరుతాయి. వీటిని తొలగించని పక్షంలో స్టోరేజీ సమస్య తప్పకుండా తలెత్తుతుంది. 

నేటివ్‌ యాప్స్‌ సెట్టింగ్స్‌ ఒకసారి పరిశీలించండి. ఇవన్నీ డివైస్‌ స్టోరేజీ పర్మిషన్‌ వాటంతట అవే కలిగి ఉంటాయి. వీటిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. లేదంటే స్టోరేజీ సెట్టింగ్స్‌ను సరిగ్గా సెట్‌ చేసుకోవాలి. ఉదాహరణకు శాంసంగ్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్‌ గెలాక్సీ సిరీస్‌ ఫోన్లకు మైక్రోసాఫ్ట్‌ యాప్స్‌ నేటివ్‌ కింద లెక్క. 

ఫైల్స్‌ బై గూగుల్‌ అన్నది ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌. జంక్‌ ఫైల్స్‌, క్యాచీ క్లీనింగ్‌తో స్పేస్‌ను ఫ్రీ చేసుకోవచ్చు. క్లీనింగ్‌కు సంబంధించి సిఫార్సులు చేస్తుంది. సెర్చ్‌, సింపుల్‌ బ్రౌజింగ్‌ ద్వారా అవసరమైన ఫైల్స్‌ను వేగంగా పొందవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. క్లౌడ్‌కు బ్యాకప్‌ ఫైల్స్‌కు చేర్చుకోవచ్చు. 

Updated Date - 2022-05-21T07:07:24+05:30 IST