బాల కార్మిక చట్టాలు ఉల్లంఘన.. అమెరికాలో వ్యక్తికి 20 లక్షల ఫైన్

ABN , First Publish Date - 2021-07-20T11:43:26+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ఒక వ్యక్తికి 20 లక్షల రూపాయల జరిమానా విధించారు.

బాల కార్మిక చట్టాలు ఉల్లంఘన.. అమెరికాలో వ్యక్తికి 20 లక్షల ఫైన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ఒక వ్యక్తికి 20 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఒక గ్రాసరీ స్టోర్ ఆపరేటర్‌కు ఈ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌కు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ స్టోర్‌లో కొందరు మైనర్లు పని చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొందరు మైనర్లు మీట్ మిక్సర్ల వద్ద పనిచేస్తుండగా, మరికొందరు అమెరికా చట్టాలు పేర్కొన్న దానికంటే ఎక్కువ గంటలు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే చైల్డ్ లేబర్ అధికారులు సదరు స్టోర్ ఆపరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని చట్టాల ప్రకారం 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని మెషీన్లు శుభ్రం చేయడానికి, వాటి నిర్వహణకు సంబంధించిన పనుల్లో పెట్టుకోకూడదు.

Updated Date - 2021-07-20T11:43:26+05:30 IST