‘మేం చలితో చచ్చిపోతుంటే ప్రభుత్వం తేదీలు మారుస్తోంది’

ABN , First Publish Date - 2021-01-17T17:48:11+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

‘మేం చలితో చచ్చిపోతుంటే ప్రభుత్వం తేదీలు మారుస్తోంది’

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు నడుస్తున్నప్పటికీ అవి ఈ నాటికీ ఒక కొలిక్కి రాలేదు. మరోవైపు రైతు సంఘాలు మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళనలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా తన పట్టువీడటం లేదు. 


అయితే ప్రస్తుతం పెరుగుతున్న చలి వాతావరణంలో రైతులు పలు అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నాన్ మోల్లాహ్ మాట్లాడుతూ రెండు నెలలుగా తామంతా విపరీతమైన చలి కారణంగా పలు అవస్థలు పడుతున్నామని, అయితే ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకుండా చర్చల పేరిట తేదీలను మారుస్తున్నదన్నారు. ఏదిఏమైనప్పటికీ తాము ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-01-17T17:48:11+05:30 IST