రూపాయి నుంచి రూ.2 వేల నోటు వరకు అన్నీ చూసే ఉంటారు.. మరి ఈ Zero Rupees Note కథేంటో మీకు తెలుసా.?

ABN , First Publish Date - 2021-12-19T22:32:08+05:30 IST

10 నుంచి 2వేల వరకూ ఉన్న అన్ని నోట్లను అందరూ చూశారు. వాటిని నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నారు. ఐదు రూపాయల నోటు కూడా ఉన్నప్పటికీ.. అవి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక రూపాయి

రూపాయి నుంచి రూ.2 వేల నోటు వరకు అన్నీ చూసే ఉంటారు.. మరి ఈ Zero Rupees Note కథేంటో మీకు తెలుసా.?

ఇంటర్నెట్ డెస్క్: 10 నుంచి 2వేల వరకూ ఉన్న అన్ని నోట్లను అందరూ చూశారు. వాటిని నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నారు. ఐదు రూపాయల నోటు కూడా ఉన్నప్పటికీ.. అవి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక రూపాయి, 2రూపాయల నోట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం చలామణీలో లేకపోవడంతో అవి ఉన్నాయన్న విషయం కూడా కొందరికి తెలియదు. అయితే.. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. సున్నా రూపాయల నోటు కూడా ఉంది. దాదాపు 10ఏళ్ల ముందు నుంచే భారత దేశంలో వీటిని ముద్రిస్తున్నారు. ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం. కాగా.. ఈ సున్నా రూపాయల నోటును కూడా ఆర్‌బీఐ ముద్రిస్తుందా లేక మరేదైనా ప్రభుత్వం రంగ సంస్థ ఆ పనికి పూనుకుంటుందా అనే వివరాల్లోకి వెళితే.. 


తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న ఫిఫ్త్ పిల్లర్ (Fifth Pillar) అనే స్వచ్ఛంద సంస్థ 2007లో మొదటిసారిగా ఈ సున్నా రూపాయల నోటును ముద్రించింది. లంచగొండితనాన్ని నివారిచేందుకు ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ ఈ సున్నా రూపాయల నోటును ప్రవేశపెట్టింది. లంచగొండి అధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే.. వారికి సున్నా రూపాయల నోటును ఇవ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఫిఫ్త్ పిల్లర్ సంస్థ.. తెలుగు, హింది, కన్నడ, మలయాళం, తదితర భాషాల్లో ఈ నోటును ముద్రిస్తోంది. 




Updated Date - 2021-12-19T22:32:08+05:30 IST