మీ ఆయన ఆస్పత్రిలో ఉన్నాడంటూ ఇంటికి వచ్చి చెప్పిన భర్త స్నేహితులు.. కంగారుగా కారు ఎక్కిన భార్య.. పెళ్లయిన 4 నెలల్లోనే..

ABN , First Publish Date - 2022-06-09T18:00:22+05:30 IST

విజయ్ బ్యాంక్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కశ్మీర్‌లో పరిస్థితి తెలుసుకున్న నేను భయపడుతూనే ఉన్నాను. బయటకు వెళ్లొద్దని విజయ్‌ను ఎంతగానో బతిమలాడాను.

మీ ఆయన ఆస్పత్రిలో ఉన్నాడంటూ ఇంటికి వచ్చి చెప్పిన భర్త స్నేహితులు.. కంగారుగా కారు ఎక్కిన భార్య.. పెళ్లయిన 4 నెలల్లోనే..

`విజయ్ బ్యాంక్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కశ్మీర్‌లో పరిస్థితి తెలుసుకున్న నేను భయపడుతూనే ఉన్నాను. బయటకు వెళ్లొద్దని విజయ్‌ను ఎంతగానో బతిమలాడాను. అతని బైక్ తాళాలు లాక్కున్నా. అయినా విజయ్ ఆగలేదు. `భయపడకు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నేను క్షేమంగా తిరిగి వస్తా. సాయంత్రం వచ్చి రాజస్థాన్‌కు టిక్కెట్లు కొంటా. రేపు మన ఊరు వెళ్దాం` అని చెప్పాడు. ఆ తర్వాత నా భర్త స్నేహితులు ఇంటికి వచ్చి నన్ను రాజస్థాన్ తీసుకొచ్చారు. అక్కడ నా భర్త మృతదేహం ఉంది`.. ఇవీ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన బ్యాంక్ ఉద్యోగి విజయ్ భార్య మనోజ్ దేవి చెప్పిన మాటలు. 


ఇది కూడా చదవండి..

హాస్టల్‌లో ఉంటూ 16 ఏళ్ల బాలిక నీట్ కోచింగ్‌.. తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..


విజయ్‌కు, మనోజ్‌కు గతేడాది జులైలో ఎంగేజ్‌మెంట్ అయింది. అదే నెలలో విజయ్‌కు కశ్మీర్‌ బ్యాంక్‌కు బదిలీ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన విజయ్, మనోజ్‌ల వివాహం జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన భార్యను కూడా విజయ్ కశ్మీర్ తీసుకెళ్లాడు. `ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాతి నుంచి విజయ్, నేను మాట్లాడుకోని రోజు లేదు. రోజుకు కనీసం గంట సేపైనా ఫోన్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. కశ్మీర్‌లో మూడేళ్లు పని చేసి రాజస్థాన్ బదిలీ చేయించుకోవాలని విజయ్ అనుకున్నాడు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడ`ని మనోజ్ చెప్పింది. 


`కశ్మీర్‌లో పరిస్థితి గురించి తెలిసి నేను చాలా భయపడ్డాను. కొంత మందిని టార్గెట్ చేసి చంపుతున్నారని తెలిసి మేం బయటకు వెళ్లే వాళ్లం కాదు. ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ కూర్చునేవాళ్లం. రాజస్థాన్‌లోని మా ఊరికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాం. ఈ నెల 1వ తేదీ రాత్రి అంతా నేను విజయ్‌ను బతిమాలుతూనే ఉన్నా. బ్యాంకుకు సెలవు పెట్టమని వేడుకున్నా. ఆ రోజు డ్యూటీకి వెళ్లి సెలవు పెడతానని విజయ్ చెప్పాడు. మళ్లీ తిరిగి ఇక ఇంటికి రాలేదు. నేను రాజస్థాన్ వచ్చే వరకు విజయ్ తీవ్రవాదుల దాడిలో చనిపోయాడని తెలియలేద`ని మనోజ్ చెప్పింది.  

Updated Date - 2022-06-09T18:00:22+05:30 IST