యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2022-05-21T06:33:28+05:30 IST

మండలంలో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
కాట్రేనిపాడులో మట్టి తవ్వకాల దృశ్యం

అధికార పార్టీ నాయకుల అండతోనే?

ముసునూరు, మే 20:  మండలంలో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. శుక్రవారం కాట్రేనిపాడు ఎస్సీ కాలనీలోని పాప కుంటలో జగనన్న కాలనీ కోసమంటూ ఎక్స్‌కవేటర్‌తో సుమారు పది నుంచి 15 ట్రాక్టర్లతో ఉదయం నుంచి మట్టిని ఇష్టానుసారంగా తోలుతుండటంతో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ గా  వీఆర్వో రమేష్‌ వచ్చి  మట్టి  తవ్వకాలను అడ్డుకున్నారన్నారు.  రమణ క్కపేట ఇంజర్లమ్మ చెరువు, యల్లాపురం పాటిమ్మచెరువు, చెక్కపల్లిలోని బాపనకుంటలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మట్టి అక్రమ తవ్వ కాలు జరుగుతున్నా మండల ఇరిగేషన్‌, రెవెన్యూ తదితర శాఖల అధికా రులు పట్టించుకోకపోవటంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప  తవ్వకాలు ఆగటం లేదని అయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.  స్థానిక అధికారులకు అధికార పార్టీ  నాయకుల ఒత్తిళ్ళ  వల్లే వారు మట్టి తవ్వకాల కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా  మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేసేలా జిల్లా ఉన్నతాధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-21T06:33:28+05:30 IST