ఆక్రమణల పర్వం

ABN , First Publish Date - 2022-05-17T06:23:01+05:30 IST

అక్రమార్కులు వరద ముంపు వెళ్ళే డ్రెయిన్‌లు, చెరువులను వదలడం లేదు.

ఆక్రమణల పర్వం
ఆలపాడులో చెరువును పూడ్చేసి నిర్మిస్తున్న గోదాము

కుంచించుకుపోతున్న కొల్లేరు డ్రెయిన్లు 

వరద ప్రవాహానికి అవరోధం 

డ్రెయిన్‌లు పూడ్చి అక్రమ నిర్మాణాలు

పట్టించుకోని అటవీ, డ్రెయిన్ల శాఖలు

కైకలూరు, మే 16: అక్రమార్కులు వరద ముంపు వెళ్ళే డ్రెయిన్‌లు, చెరువులను వదలడం లేదు. అధికారులు ఈ ఆక్రమణలపై దృష్టి సారించకపోవడంతో వీరి ఆగడాలకు ఆగడం లేదు. దీనితో వర్షాకాలంలో కొల్లేరుకు వరద వస్తే గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నాయి. కైకలూరు మం డలం పెంచికలమర్రులో కొల్లేరు నుంచి వచ్చే నీరు ప్రవహిం చే జువ్వకనుమల డ్రెయిన్‌ను గ్రామస్తులు ఆక్రమిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఈ డ్రెయిన్‌ ద్వారా వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు, సర్కార్‌ కాల్వలోకి చేరుతుంది. ఇలా ప్రమా దమైన డ్రెయిన్‌పై గ్రామ పెద్దల సహకారంతో ఆక్రమణకు తెరతీశారు. నిత్యం ఈ డ్రెయిన్‌లో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వరద ఉధృతి సమయంలో 15 అడుగుల లోతున పారుతుంది. అత్యంత ప్రమాదకరమైన డ్రెయిన్‌ ఆక్రమణకు గురి కావడం వల్ల వరద ప్రవాహానికి అవరోధంగా మారడ మే కాక ఆ గ్రామంతోపాటు కొన్ని గ్రామాలు ముంపు బారిన పడతాయి. గతంలో వరద వచ్చిన సమయంలో పెంచికల మర్రు ముంపునకు గురైంది. ఈ డ్రెయిన్‌ గట్టు వెంబడి ఆల పాడు నుంచి కొల్లేటికోట వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి ఉన్నది. ఈ ఆక్రమణలతో రహదారిపై ప్రయాణించే ప్రజలు ఇబ్బందు లకు గురవుతారు. రహదారి వెంబడి ఆక్రమణలతో రాకపోకల కు అంతరాయం కలుగుతాయని లంక గ్రామాల ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఆలపాడు నుంచి గుండుగొలను హైవేకు కలుపుతూ కొల్లేరు నుంచి వెళ్ళే ప్రధాన మార్గం ఈ రహదారి వెంబడి నిత్యం కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రయాణిస్తారు. శృంగవరప్పాడు, గుమ్మళ్ళపాడు, పందిరిపల్లిగూడెం గ్రామాల తోపాటు కొల్లేరులోని మరి కొన్ని గ్రామాల ప్రజలు సైతం నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. డ్రెయిన్‌ ఆక్ర మణకు గురవుతున్నప్పటికీ అధికారులు కానీ, కొల్లేరు అభ యారణ్యం అటవీ శాఖ అధికారులు కానీ పట్టించుకోకపో వడంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వేసవి కాలాన్ని అడ్డుగా పెట్టుకుని ఆక్రమణకు తెర తీశారు. కొంత మంది ఇళ్ళ నిర్మాణాల పేరుతో, కొంత మంది షాపింగ్‌ కాంప్లెక్స్‌ పేరుతో  డ్రెయిన్‌ను పూడ్చివేస్తున్నారు. వడ్లకూటితిప్పలో ఇదే రహదారిని ఆనుకుని పూడిక పనులు నిర్వహిస్తు న్నారు. కొల్లేరును పరిరక్షించాల్సిన అధికారులు ఈ ఆక్రమణల వైపు కన్నెత్తి చూడకపోవడంతో విమర్శలకు దారితీస్తున్నది. ఆలపాడు గ్రామ శివారు ఏలూరు – పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దున ఉన్న ఉప్పు టేరు సెంటర్‌లో పంచాయతీకి చెందిన చెరువును పూడ్చి అక్రమంగా గొడౌన్‌ల నిర్మాణాన్ని చేస్తు న్నారు. ఇప్పటికే పలువురు చెరువును పూడ్చి సొంతంగా ఇళ్ళ నిర్మాణం చేసుకున్నా అధికా రులు అడ్డుకోకపోవడంతో అక్రమంగా ఇళ్ళ నిర్మాణం చేసిన వ్యక్తే మరో గోడౌన్‌ నిర్మా ణాన్ని చేపట్టారు. ఇటీవల ఈ అక్రమ నిర్మాణాలపై గ్రామ పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ పూడికలు అడ్డుకట్టవేయకపోతే రానున్న రోజుల్లో డ్రెయిన్‌లు, రోడ్ల మనుగడ సాగించే పరిస్థి తులు ఉండవని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. 

Updated Date - 2022-05-17T06:23:01+05:30 IST