భూంఫట్‌...!

ABN , First Publish Date - 2022-05-21T06:27:15+05:30 IST

జాగా దొరికితే చాలు.. జెండా పాతేస్తున్నారు. నలుగురూ నడిచే రోడ్లని కూడా చూడకుండా మింగేస్తున్నారు.

భూంఫట్‌...!

రోడ్డు ఆక్రమణలో వైసీపీ కార్పొరేటర్లు

ఫిర్యాదుదారుడిపై అధికారుల ఎదుటే దాడి

ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరింపులు

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు


జాగా దొరికితే చాలు.. జెండా పాతేస్తున్నారు. నలుగురూ నడిచే రోడ్లని కూడా చూడకుండా మింగేస్తున్నారు. కార్పొరేటర్లమన్న స్పృహను మరిచి ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఫిర్యాదు వెనక్కు తీసుకోకుంటే ప్రాణాలు తీస్తామంటున్నారు. కార్పొరేషన్‌ ఆస్తులు కాపాడాల్సిన కార్పొరేటర్లే అధికారులను ప్రలోభ పెడుతూ రహదారులను కబ్జా చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన బాధితుడిపై ఇద్దరు కార్పొరేటర్లు దాడి చేయడం కలకలం రేపింది. 


ఏలూరు, మే 20(ఆంధ్రజ్యోతి):ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 5వ డివిజన్‌ చాటపర్రు రోడ్డులో రాఘవేంద్ర అపార్ట్‌మెంట్స్‌ వెనుక ఉన్న 33 అడుగుల రోడ్డుపై కొందరు పెద్దల కన్ను పడింది. గతంలో వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఉన్న ఆ ప్రాంతంలో ఆర్‌.ఎస్‌ నెంబర్‌ 799, 801లో భూమిని ప్లాట్లుగా విభజించారు. దాని పీఆర్పీ నెం. 90లో ఉన్న 800 చదరపు గజాలతో రాఘవేంద్ర అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. మిగిలిన స్థలంలో అధిక భాగం కామన్‌ ఏరియా ఉంది. అయితే కామన్‌ ఏరియా కాబట్టి నలుగురికీ ఉపయోగపడేలా కల్యాణ మండపం నిర్మించుకో వాలని ఓ సంఘం సభ్యులమని చెబుతూ కొందరు అక్కడ గత గురువారం శంకుస్థాపన చేశారు. వాస్తవానికి అది కామ న్‌ ఏరియా స్థలం కాదని, 33 అడుగుల రోడ్డుగా ఉందని చెబు తూ అందుకు తగిన లే–అవుట్‌ ఆధారాలతో స్థానికంగా రాజేంద్రనాథ్‌ అనే వ్యక్తి స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా విచారణకు వెళ్లిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఫిర్యాదుదారుడి తోపాటు ఆరోపణలు ఎదుర్కొం టున్న ఇద్దరు కార్పొరేటర్లను అక్కడకు పిలిపించారు. అందరితో కలిసి మాట్లాడుతుండగా, కార్పొరేటర్లు జయకర్‌, సుంకర చంద్రశేఖర్‌  ఫిర్యాదుదారుడిపై దౌర్జన్యానికి దిగారు. కార్పొరే టర్లపై బాధితుడు రాజేంద్ర  ప్రాణాలు తీస్తామని బెదిరిం చినట్లు ఏలూరు రూరల్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2005లో సుమారు మూడెకరాల 13 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి, అందులో కొంత భాగం అపార్ట్‌మెంట్‌ నిర్మించగా, అపార్ట్‌మెంట్‌కు మూడు వైపులా రహదారులకు వదిలారని, ఆ వివరాలన్నీ లే–అవుట్‌ కాపీలో ఉన్నట్లు అధి కారులకు ఆధారాలు ఇచ్చామని స్థానికులు తెలిపారు. 

 

కామన్‌ ఏరియాలో నిర్మాణాలు

ఒక లే–అవుట్‌ ఏర్పాటు చేస్తున్న క్రమంలో పంచాయతీ లేదా కార్పొరేషన్‌ అనుమతులు పొందే క్రమంలో పలు నిబం ధనలను అనుసరించాలి. ఇందులో భాగంగా ఏర్పాటు చేయ బోతున్న లే–అవుట్‌ నుంచి 14 శాతం స్థలాన్ని కామన్‌ ఏరియా కింద వదిలేయాలి. ఇందులో ప్రజోపయోగ నిర్మాణాలంటే పిల్లలకు ఉపయోగపడేలా పార్కులు, జిమ్‌, గ్రంథాలయాలు వంటివి మాత్రమే నిర్మించాలి. అది లే– అవుట్‌ సంబంధిత ఒక ప్రత్యేక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరగాలి. తలపెట్టిన ప్రతీ నిర్మాణానికి కార్పొరేషన్‌ లేదా సంబంధిత స్థానిక సంస్థ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇందులో రోడ్డును కామన్‌ ఏరియాగా చూపించిన కొందరు పెద్దలు అందులో నిర్మాణం చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కామన్‌ ఏరియాలో ప్రైవేట్‌ వ్యక్తులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. స్వర్ణకా రుల సంఘానికి గతంలో స్థలం ఇచ్చారని చెబుతూ కొందరు నిర్మాణాలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంఘా నికి ఇచ్చిన స్థలంలో ప్రస్తుత ఆక్రమిత స్థలం లేదని, ఆక్రమిత స్థలం పూర్తిగా 33 అడుగుల రహదారికే కేటాయించి ఉందని కార్పొరేషన్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


దౌర్జన్యం చేయాల్సిన పనేంటి ? 

‘నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాప నకు భారీ ఏర్పాట్లు చేసి, రాజకీయ నాయ కులను ఆహ్వానించారు. నిబంధనలకు విరు ద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని నేను స్పందనలో ఫిర్యాదు చేశా. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు రమ్మం టే వెళ్లి మాట్లాడుతుండగా, ఆ ఇద్దరు కార్పొరేటర్లు వచ్చి నోటికొచ్చినట్లు తిడుతూ, చంపుతామని బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశా. వాళ్లు తప్పు చేయకుంటే దౌర్జన్యం చేయాల్సిన పనిలేదు’ అని ఫిర్యాదుదారుడు దారం రాజేంద్ర వాపోయారు. ‘నేను కన్నెర్ర చేస్తే రేపటికి ఉండవు. నేనెవరో తెలుసా? ఫిర్యాదు చేయడానికి నువ్వెవడ్రా? మేం కుమ్మక్కయి నట్లుగా ఫిర్యాదు చేయడానికి నువ్వెవడవి?’’ అంటూ 6వ డివి జన్‌ కార్పొరేటర్‌ బూతులు తిడుతూ బెదిరించారు’ అని స్థానికుడు ఎస్‌ఎన్‌ఎస్‌ చంద్రకాంత్‌ చెప్పారు. 



Updated Date - 2022-05-21T06:27:15+05:30 IST