ఓటే వజ్రాయుధం

Published: Tue, 25 Jan 2022 01:11:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఓటే వజ్రాయుధం

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

నిడమర్రు, జనవరి 24 :  ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది రాయి ఓటు హక్కు. ఏ దేశం .. ఏ రాష్ట్రంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా  కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా వినియోగిస్తారో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పదికాలల పాటు వర్థిల్లుతుందని రాజకీయ పండితులు చెబుతుంటారు. నేటి యువత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యే లా చూడడమే ఓటరు దినోత్సవ లక్ష్యం. ఆర్టికల్‌ 324 ద్వారా ఏర్పడిన ఎన్నికల కమీషన్‌ ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటరు దినోత్సవం జరపాలని నిర్ణయించింది. 2011లో అప్పటి ప్రధాని మన్‌మ్మోహన్‌సింగ్‌ యువతలో ఓటరు నమోదు ప్రాధాన్యత పెంచడం కోసం ఎన్నికల కమీ షన్‌ ఆవిర్భావ  తేదీ అయిన జనవరి 25నే ఓటరు దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతిఏటా ఈ తేదీన ఓటరు దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఓటరు దినోత్సవం ప్రధాన లక్ష్యం ఓటర్లకు సాధికారిత, జాగురూకత, భద్రత కల్పిస్తూ, సమాచారాన్ని అందించడం. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను నూతన ఓటరుగా నమోదు చేయాలని వారిని ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేయాలనే సంకల్పించింది. నేటి ఆధునిక కాలంలో ఓటు హక్కు సులువుగా పొందేలా ఆన్‌లైన్‌ ద్వారా   ఓటు నమోదును ఎన్నికల కమీషన్‌ చేపట్టింది. 

జిల్లాలో ఓటర్ల వివరాలు.. 

జిల్లాలో మొత్తం పురుష ఓటర్లు 16,05,217, మహిళా ఓటర్లు 16,71,783, ఇతరులు 231 మంది కలిసి మొత్తం 32,77,231 మంది ఓటర్లు ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పురుషుల కంటే స్త్రీ ఓటర్లు సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో పురుషులు, స్ర్తీల లింగ నిష్పత్తి 1000: 1041 గా ఉండడం గమనార్హం. 1–11–21 నుంచి 4.1.2022 జిల్లాలో నమోదయిన కొత్త ఓటర్లలో 18–19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 12,018 మంది ఉండగా 20 ఏళ్లు పైబడిన వారు 13, 422 మంది ఉన్నారు. 

వయస్సు  వారీగా ఓటర్ల వివరాలు 

 వయస్సు ఓటర్ల సంఖ్య

18–19 27,724

20–29 6,00,750

30–39 9,09,000

40–49 6,91,825

50–59 5,15,176

60–69 3,18,369

70–79 1,59,642

80+ 54,745

జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లలో 20 నుంచి 40 వ యస్సు ఓటర్లు సంఖ్య ఎ క్కువగా కనబడుతోంది. మొత్తం ఓటర్లు సంఖ్యలో వీరి బలం 46%గా ఉంది. 20 నుంచి 40 వయస్సు వారి ఓటే రాబోయే ఎన్నిక లలో కీలకంగా మారనుంది. 

జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ 4.1.2022 నాటికి జిల్లాలో నియోజకవర్గాల వారీగా  ప్రకటించిన ఓటర్లు


నియోజకవర్గం     పురుషులు     స్ర్తీలు   ఇతరులు మొత్తం

1.కొవ్వూరు (ఎస్సీ)    87144 91846     9     178999

2.నిడదవోలు         101215 104958     7         206180

3.ఆచంట         88517 90753     3         179273

4.పాలకొల్లు         97239 100631     13 197883

5.నరసాపురం         83293 84224     2     167524

6.భీమవరం        123863 130592        45         254503

7.ఉండి         111073 114990     12 226075

8.తణుకు         116988 122738     6         239732

9.తాడేపల్లిగూడెం 104983 109556        17     214556

10 ఉంగుటూరు 100469 102952        6     203427

11. దెందులూరు 110956 115002     9         225967

12.ఏలూరు     112699 124487        36     237422

13.గోపాలపురం(ఎస్సీ)116236 119055    13     235304

14.పోలవరం(ఎస్టీ) 118421 125624        8     244053

15.చింతలపూడి (ఎస్సీ) 131916 134375     42 266333

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.