స్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీం

ABN , First Publish Date - 2021-04-24T17:52:42+05:30 IST

స్ట్రాబెర్రీలను ముక్కలుగా కట్‌ చేసుకుని పంచదార కలపాలి. ఒక గంట పాటు పక్కన పెట్టాలి. తరువాత మిశ్రమాన్ని మిక్సీలో తీసుకుని బాసిల్‌, నిమ్మరసం వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. దీన్ని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టి తరువాత ఐస్‌క్రీమ్‌ మిషన్‌లో పెట్టుకోవాలి. ఐస్‌క్రీమ్‌

స్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీం

కావలసినవి: స్ట్రాబెర్రీలు - 450గ్రాములు, పంచదార - తగినంత,  బాసిల్‌ - పావు  కప్పు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం: స్ట్రాబెర్రీలను ముక్కలుగా కట్‌ చేసుకుని పంచదార కలపాలి. ఒక గంట పాటు పక్కన పెట్టాలి. తరువాత మిశ్రమాన్ని మిక్సీలో తీసుకుని బాసిల్‌, నిమ్మరసం వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. దీన్ని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టి తరువాత ఐస్‌క్రీమ్‌ మిషన్‌లో పెట్టుకోవాలి. ఐస్‌క్రీమ్‌ మిషన్‌ లేనట్టయితే ఫ్రిజ్‌లో పెట్టుకుని ఐస్‌క్రిస్టల్స్‌ ఏర్పడకుండా ఉండేందుకు ప్రతీ అరగంటకోసారి కలుపుతూ ఉండాలి. చల్లగా సర్వ్‌ చేసుకుంటే స్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీమ్‌ రుచిగా ఉంటుంది.


Updated Date - 2021-04-24T17:52:42+05:30 IST